Free training for youth in IT: ITలో యువతకు ఉచిత శిక్షణ
ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్(తులిప్) ఆధ్వర్యంలో డిగ్రీ, తత్సమాన అర్హత కలిగిన వారికి ఇంటర్న్‌షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు యూసీడీ పీడీ పాపునాయుడు తెలిపారు.
ఇంజినీరింగ్‌తో పాటు అర్బన్ ప్లానింగ్, అర్బన్ డిజైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబిలిటీ, ఫైనాన్స్, సోషల్ సెక్టార్, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో విభాగాల్లో శిక్షణ, ఉపాధి కల్పిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయా కోర్సులు 8 వారాల నుంచి ఏడాది వరకు ఉంటాయని వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ చెల్లిస్తుందన్నారు.
బి.ప్లాన్, బీటెక్, బీఆర్క్, బీఏ, బీఎస్సీ, బీ.కాం, బీబీఏ, బీఈఏ, ఎల్‌ఎల్‌బీ తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు నగర సామాజిక అభివృద్ధి విభాగం(యూసీడీ), జీవీఎంసీ, జోనల్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.