Free Training for women: ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కోసం మహిళలకు శిక్షణ
Sakshi Education
ఖలీల్వాడి: మహిళలు స్వీయ రక్షణ శిక్షణలో భాగంగా మార్చి 2న 10వేల మందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. ఇందుకోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళలకు తైక్వాండో శిక్షణ ను ప్రారంభించారు.
అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ మార్చి 2న గిరిరాజ్ కాలేజీలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 10 వేల మంది మహిళలతో నిర్వహిస్తామని తెలిపా రు. కార్యక్రమంలో కల్మేశ్వర్, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఆర్‌సీఐ రమేశ్, తైక్వాండో కార్యదర్శి కె.మనోజ్ కుమార్, పోలీస్ శాఖ సి బ్బంది, ఫారెస్ట్ శాఖ సిబ్బంది, హెల్త్ డిపార్ట్‌మెంట్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 29 Feb 2024 05:35PM