Skip to main content

DSC Notification: DSC అప్లికేషన్స్‌లో దొర్లుతున్న తప్పులు

DSC Notification, DED, BED, Language Pandit Training Graduates Applying for DSC (TRT) Examination, Online DSC (TRT) Application Process for Etoorunagaram Candidates
DSC Notification

ఏటూరునాగారం: డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ(టీఆర్‌టీ) పరీక్ష రాసేందుకు మీ సేవ, ఆన్‌లైన్‌ సెంటర్ల వద్ద దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.వెయ్యి వరకు ఖర్చు చేసి అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అప్లికేషన్‌ ప్రక్రియలో వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ అప్‌లోడ్‌ చేస్తున్నారు. తీరా ప్రింట్‌ తీసి చూసుకునే సరికి తప్పులు దొర్లుతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మీ సేవ, ఆన్‌లైన్‌ సెంటర్ల వద్ద అభ్యర్థులు, నిర్వాహకులకు మధ్య తీవ్ర ఆందోళన చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.

Published date : 05 Oct 2023 11:15AM

Photo Stories