Woman Inspiring Story: తొలి మహిళా రేసర్‌గా చరిత్ర సృష్టించిన డయానా.. ఇంతకీ ఎవరీమె?
మనకు నచ్చిన అభిరుచి వైపు అకుంఠిత దీక్షతో సాగితే ఉన్నత విజయ శిఖరాలను అందుకోవడం ఖాయం. అలా ఎందరో గొప్ప గొప్ప విజయాలను అందుకుని స్ఫూర్తిగా నిలచారు కూడా. అలాంటి కోవకు చెందిందే డయానా పుండోల్. ఇంతకీ ఎవరీమె? ఏం సాధించిందంటే..
పూణేకు చెందిన 28 ఏళ్ల డయానా పుండోల్ పురుషులే ఎక్కువగా ఇష్టపడే రేసింగ్‌ల వైపుకు అడుగులు వేసింది. రేసింగ్ అనేది పురుషాధిక్య కాంపీటీషన్ అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు ఇటువైపు రావడం. అదీగాక ఎక్కువగా పురుషులే ఈ కారు రేసింగ్‌లో ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంటారు. ఇంతవరకు వాళ్లే ఈ రంగంలో అధిక్యంలో ఉన్నారు. అలాంటి సాహసకృత్యంతో కూడిన రేసింగ్‌ని డయానా ఎంచుకుంది. పైగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెబుతుండటం విశేషం.
Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ టూ బీటెక్ అభ్యర్థుల కోసం మెగా జాబ్‌మేళా
ఎంతో అంకితభావంతో రేసింగ్‌లో శిక్షణ తీసుకుని ఏకంగా నేషల్ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అంతేగాదు ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా రేసర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె టీచర్‌గా పనిచేస్తూ వీకెండ్‌లలో రేసింగ్ ప్రాక్టీస్ చేసి మరీ విజయం సాధించడం విశేషం. ఇన్నాళ్లుగా మహిళలు సాహస క్రీడల్లో పాల్గొనడం అంటే మాటలు కాదు అనే వాళ్ల నోళ్లు మూయించేలా విజయఢంకా మోగించింది డయానా. మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో ధైర్యంగా దూసుకుపోగలరని తన గెలుపుతో చాటి చెప్పింది. అంతేగాదు పురుషలకు ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరని నర్మగర్భంగా చెప్పింది.
AP PGCET Counselling 2024: ప్రారంభమైన పీజీ సెట్–2024 ఆప్షన్ల ప్రక్రియ
కాగా, ఆమె ఇలాంటి పలు ఇతర ప్రతిష్టాత్మకమైన రేసింగ్‌లలో పాల్గొంది కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రసిద్ధ రేసింగ్ కాంపిటీషన్ అన్నింటిల్లోనూ పాల్గొంది. ముఖ్యంగా దుబాయ్ ఆటోడ్రోమ్, యూరప్, యూఏఈలోని హాకెన్‌హైమ్రింగ్, బెల్జియంలోని F1 సర్క్యూట్ డి స్పా వంటి రేసింగ్‌లలో కూడా పాల్గొంది. పైగా రానున్న జనరేషన్ ధైర్యంగా ఇలాంటి వాటిల్లోకి వచ్చేలా ప్రేరణగా నిలిచింది. ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నైపుణ్యం తోడైతే ఎలాంటి ఛాలెంజింగ్ క్రీడల్లో అయినా విజయం సాధించొచ్చని డయానాని చూస్తే తెలుస్తోంది కదూ..!.