Skip to main content

TS Schools & Colleges Holidays : జూలై 18వ తేదీ వ‌ర‌కు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో షాక్‌ తగిలినట్లైంది.
TS Schools & Colleges Holidays Latest News
TS Schools & Colleges Holidays

మ‌రో మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ కూడా జారీ చేసింది. అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్న క్రమంలో  విద్యాసంస్థలకు సెలవులను తెలంగాణ విద్యాశాఖ పొడిగించింది. తెలంగాణ విద్యాసంస్థలు జూలై 18వ తేదీన‌ (సోమ‌వారం) తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే జూలై 14, 15వ తేదీన జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి.

School & Colleges Holidays

TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

హైద‌రాబాద్ మాత్రం..
ముఖ్యంగా తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైద‌రాబాద్ లో గ‌త మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

Schools Holidays : మూడు రోజులు పాటు పాఠశాలలు సెల‌వులు.. కార‌ణం ఇదే..

తెలంగాణ‌లోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ..
ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

Published date : 13 Jul 2022 05:21PM

Photo Stories