IOCL: నిరుద్యోగులకు ఐఓసీఎల్ సంస్థ ద్వారా శిక్షణ
మంగళవారం కలెక్టరేట్‌లో ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్)తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సంయుక్త ఒప్పంద కుదుర్చుకున్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో ఐఓసీఎల్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు వెల్లడించారు. పైప్‌లైన్ సౌకర్యమున్న గ్రామాలకు ఆర్‌ఓ యూనిట్లను ఉచితంగా పంపిణీ చేస్తామని వివరించారు. అనంతరం రూ.18,65,200 సీఎస్‌ఆర్ చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఐఓసీఎల్ అడిషనల్ డైరెక్టర్ దినేష్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ బాలమురుగన్, సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ రఘువంశీ, జిల్లా నైపుణ్యాభివృద్ధిశాఖాధికారి గుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు జీతం..
Tags
- IOCL
- IOCL Training
- Free training for youth
- AP Skill Development Institute
- IOCL Training Certificate
- National Academy of Construction
- Collector
- Indian Oil Corporation Limited
- Education News
- andhra pradesh news
- Youth training programs
- District development
- District Youth
- training programme
- chitoor district news