Mother and Daughter: పదో తరగతి పరీక్షకు హాజరైన తల్లీ కూతురు..!
Sakshi Education
విద్యార్థులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రలు కూడా వారి సమయంలో చదవలేకపోవడం కారణంగా ఇప్పుడు వారి పిల్లలతో కలిసి చదివి పరీక్షలకు హాజరవుతున్నారు. అందులో వీరు మరొకరు..
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా మళ్లూరు స్వామి వివేకానంద విద్యాసంస్థలో తల్లీ కూతురు కలిసి ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్ష రాస్తున్నారు. తల్లి ఛాయ (36), కుమార్తె శ్రీవాణి టెన్త్ పరీక్షలకు గురువారం హాజరయ్యారు. ఛాయ ముత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌డిఎంసి ఉపాధ్యక్షురాలు కూడా.
School Teachers: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్..!
ఆమెకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు పీయూసీ, చివరి కూతురు 7వ తరగతి. రెండవ కూతురు టెన్త్ క్లాస్. ఇప్పుడు ఎందుకు పరీక్ష రాస్తున్నానో ఆమె వివరిస్తూ, 9వ తరగతిలో ఉండగానే నాకు త్వరగా పెళ్లి చేశారు. స్వంత ఊరు ఇదే తాలూకాలో నాయనహళ్లి. ఉన్నత చదువులు చదవాలనే ఆశతో టెన్త్ ప్రైవేటుగా చదివి పరీక్ష రాస్తున్నట్లు తెలిపింది. కాగా, ఆమె విద్యాసక్తిని పలువురు కొనియాడారు.
Published date : 29 Mar 2024 05:22PM