FLL Robotics: అమెరికాలో జరగనున్న ఎఫ్‌ఎల్‌ఎల్ రోబోటిక్స్ పోటీలకు ఈ విద్యార్థులు ఎంపిక..
కొమ్మాది: ఫస్ట్ లెగో లీగ్ (ఎఫ్‌ఎల్‌ఎల్) రోబోటిక్స్ పోటీలు ఈ నెల 17 నుంచి 20 వరకు అమెరికాలో గల హోస్టన్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు భీమిలి బీచ్ రోడ్డు వారిజ నేత్ర విద్యాలయంలో విద్య అభ్యసిస్తున్న ఆరుగురు అంధ విద్యార్థులు ఎంపికైనట్లు విద్యాలయ నిర్వహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పందన, ధనలక్ష్మి, రవి, గాయత్రి, సుప్రియ, సంజయ్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ఇటీవల గోవాలో జరిగిన ఎఫ్‌ఎల్‌ఎల్ రోబోటిక్స్ పోటీల్లో 5 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా ఇక్కడి నేత్ర విద్యాలయంలో విద్య అభ్యసిస్తున్న అంధ విద్యార్థులు పాల్గొని టీమ్ చాంపియన్‌షిప్ సాధించినట్లు తెలిపారు. ఈ పోటీలు అనంతరం 28న అమెరికా నుంచి బయలుదేరి వారీజా ఆశ్రమానికి చేరనున్నట్లు నేత్ర విద్యాలయ ప్రెసిడెంట్ పీఎస్‌ఎన్ రాజు తెలిపారు.
World Trade Organization: భారతదేశం బియ్యం సబ్సిడీలపై WTO శాంతి నిబంధన