Skip to main content

AP Inter Exams Reverification And Recounting Process: రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఎలా చేస్తారు? ఎలా అప్లై చేయాలి?

AP Inter Exams Reverification And Recounting Process

ఏపీ ఇంటర్మీడియల్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు జిల్లా నిలవగా, ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 67 శాతంగా ఉండగా, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 78%గా ఉంది. అయితే పరీక్షలు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చాయని భావించే విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ అంటే ఏంటి?

ఫలితాలకు రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ అనేవి వేర్వేరు. రీకౌంటింగ్‌ విధానంలో మరోసారి మార్కుల రీకౌంటింగ్‌ ఉంటుంది. రీవాల్యుయేన్‌లో జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేస్తారు. ఆ సాఫ్ట్‌ కాపీని విద్యార్థికి అందజేస్తారు. 

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఇలా దరఖాస్తు చేయండి:

1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ap.gov.in ని సందర్శించాలి. హోంపేజీలో స్టూడెంట్‌ మెనూ బార్‌పై క్లిక్‌ చేయండి. 
2. తర్వాత మార్కుల రీకౌంటింగ్‌ లేదా రీవెరిఫికేషన్‌ ఆఫ్‌ వాల్యూడ్‌ ఆన్సర్‌ స్రిప్ట్స్‌ ఆనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
3. ఆ తర్వాత హాల్‌ టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ, ఈ మెయిల్‌ ఐడీని నమోదు చేయాలి. 
4. get data అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. 
5. ఇప్పుడు పై వివరాలను వెరిఫై చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌చేయాలి. 


ఫీజు వివరాలు ఇవే:

  • రీకౌంటింగ్‌ కోసం ఒక్క సబ్జెక్ట్‌కు రూ. 260 చెల్లించాల్సి ఉంటుంది. 
  • రీవాల్యుషేయన్‌ కోసం ఒక్క పేపర్‌కు రూ. 1300 చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే..అయితే ఒక్కసారి ఫీజు చెల్లించిన తర్వాత రీఫండ్‌ అవ్వవు. 
Published date : 12 Apr 2024 04:16PM

Photo Stories