Skip to main content

State Level Competitions: క‌త్తిసాము పోటీకి విద్యార్థుల ఎంపిక‌

ఇటీవ‌లె జిల్లాస్థాయిలో నిర్వ‌హించిన క‌త్తిసాము పోటీలను నిర్వ‌హించారు. ఇందులో త‌మ ప్ర‌తిభను క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌ను రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఎంపిక చేసిన‌ట్లు పాఠ‌శాల వ్యాయామ ఉపాధ్యాయుడు ప్ర‌క‌టించారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర స్థాయి కత్తిసాము పోటీలకు చీడికాడ మండలం, వరాహపురం హైస్కూల్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియంలో జిల్లా స్థాయి కత్తిసాము పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాఠశాల విద్యార్థులు బద్ది లలిత, విస్సారపు కృష్టవేణి, పడాల ఉర్మిళ, పి.రూపేష్‌, పడాల హర్షవర్ధన్‌, సిరసపల్లి గౌతమ్ త‌మ‌ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సింహాచలం సోమవారం తెలిపారు.

➤   Create Resume : ఇలా రెజ్యూమ్‌ క్రియేట్ చేస్తే.. జాబ్ ప‌క్కా..!

ఈ విద్యార్థులు ఈ నెల 15, 16, 17, తేదీల్లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం దొడ్డి వరాహమూర్తి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు ధర్మిశెట్టి స్వాతి, సర్పంచ్‌ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబుతో పాటు ధర్మిశెట్టి కొండబాబు, స్కూలు కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Published date : 14 Nov 2023 11:17AM

Photo Stories