Skip to main content

Skill Training for Students: విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ

skill training for students, VocationalTraining, skill development

బనశంకరి: రాష్ట్రంలో వివిధ సమాచార సాంకేతిక సంస్థలతో వంద ఇంజినీరింగ్‌ కాలేజీల్లోని విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీబీటీ ఽశాఖమంత్రి ప్రియాంక్‌ఖర్గే తెలిపారు. నవంబర్ 10న శుక్రవారం వైద్యవిద్య, వృత్తి నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శరణ ప్రకాశ్‌ పాటిల్‌తో నిర్వహించిన సమాచార సాంకేతిక వృత్తి నైపుణ్య సలహా సమితి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. యానిమేషన్‌, గేమింగ్‌, రోబోట్స్‌, ఆటోమేషన్‌, డ్రోన్‌ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండగా అలాంటి వాటిలో యువతీ యువకులకు వృత్తి నైపుణ్యశిక్షణ అందించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

చదవండి: ChatGPT: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

Published date : 11 Nov 2023 03:24PM

Photo Stories