Show Cause Notice: విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు..
Sakshi Education
పది, ఇంటర్ పరీక్షలు ముగిసిన అనంతరం అధికారులు ఉపాధ్యాయులను స్పాట్ వాల్యువేషన్ కోసం నియమించారు. వారందరికీ తగిన ఆదేశాలను ఇచ్చారు అయినప్పటికీ కొందరు గైర్హాజరైయ్యారు..
నిర్మల్ రూరల్: పదో తరగతి స్పాట్ విధులకు హాజరుకాని 62 మంది ఉపాధ్యాయులకు డీఈవో రవీందర్‌రెడ్డి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో స్పాట్‌ను ప్రారంభించారు. జిల్లాలోని పలువురు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు విధులను కేటాయించారు. కానీ అందులో 62 మంది విధులకు హాజరు కాలేదు.
వీరందరికీ షోకా జ్ నోటీసులను జారీ చేశారు. శనివారం ఉద యం 9 గంటల లోపు స్పాట్ కేంద్రంలో హాజ రు కావాలని, హాజరు కాకుంటే వారి వేతనం కూడా నిలిపివేస్తామని డీఈవో హెచ్చరించా రు. జిల్లాకు 1.41 లక్షల జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఈనెల 13 వరకు మూ ల్యాంకనం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Published date : 06 Apr 2024 04:50PM