Skip to main content

Scholarship 2024: విప్రో ఉమెన్‌ స్కాలర్‌షిప్‌కు 92 మంది ఎంపిక, ఏడాదికి అందే నగదు మొత్తమిదే

Scholarship 2024

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాల విద్యార్థులు సరికొత్త చరిత్ర లిఖించారు. విప్రో కెరీర్‌, విప్రో ఫౌండేషన్‌ వారు 2023–24 విద్యా సంవత్సరానిగాను ప్రకటించిన ‘సంతూర్‌ ఉమెన్స్‌ స్కాలర్‌షిప్‌‘ అవార్డుకు ఆ కళాశాల నుంచి రికార్డు స్థాయిలో 92 మంది ఎంపిక కావడం గమనార్హం.

జిల్లాలో ఒక విద్యాసంస్థ నుంచి ప్రభుత్వ/ప్రైవేటు స్కాలర్‌షిప్‌కు ఇంతమంది ఒకేసారి ఎంపిక కావడం ఇదే మొదటిసారని అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికై న వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.2000 లెక్కన ఏడాదికి రూ.24వేలు చొప్పున మూడేళ్లకు కలిపి రూ.72,000ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు.

Cisco layoffs 2024: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీ.. కారణమిదేనా?


ఈ సందర్భాన్ని పురష్కరించుకుని కళాశాలలో శుక్రవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ కళాశాల నుంచి 92 మంది సంతూరు ఉమెన్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సూర్యచంద్ర కొనియాడారు.

Published date : 10 Aug 2024 04:57PM

Photo Stories