Skip to main content

Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ ప్లస్‌ గ్రేడ్‌

Local Government Degree College excels with A+ rating  A Plus Grade for Govt Degree College   College Principal Prof. Prasad announces A+ grade achievement

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతి పత్తి) ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌ తెలిపారు. గురువారం ఈ మేరకు కళాశాల ఆవరణలో బాణాసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ న్యాక్‌ ఫీయర్‌ టీం కళాశాలను ఇటీవల సందర్శించిందన్నారు. ఈ సందర్శనలో కళాశాలలో ఏడు అంశాల వారీగా పరిశీలించారన్నారు. ఇందులో కళాశాల మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, తదితర అంశాలు 3.5 పాయింట్లతో ఏ గ్రేడ్‌ ప్లస్‌ సాధించడంలో తోడ్పడ్డాయన్నారు. ఈ గ్రేడ్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఐక్యూ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మధుసూదన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ సుదర్శనంను ప్రిన్సిపాల్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌

sakshi education whatsapp channel image link

Published date : 23 Dec 2023 09:21AM

Photo Stories