Pariksha Pe Charcha PM Modi : ప్రధాని మోదీనే.. ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని.. ఈ ప్రశ్నకు సమాధానంగా..
దేశంలో అతి ప్రాచీన భాష తమిళ్ కార్మికులు నివసించే బస్తీలోని ఒక చిన్నారిని ఉదాహరణగా తీసుకుని.. విద్యార్థిని ప్రశ్నకు ప్రధాని బదులిచ్చారు.
➤ Pariksha Pe Charcha: షార్ట్‌కట్స్ వద్దు... చీటింగ్ చేసేందుకు తెలివితేటల్ని వినియోగించకండి: మోదీ
అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందో..
‘‘8 ఏళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. బస్తీలో నివసించే ఆ చిన్నారి అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందో తెలుసుకున్నా. ఆమె అన్ని భాషలు మాట్లాడేందుకు కారణాలున్నాయి. ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వారు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడంతో వారితో నిత్యం మాట్లాడుతూ ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుంది’’ అని ప్రధాని వివరించారు.‘‘అన్ని భాషలు నేర్చుకునేందుకు ఆ చిన్నారి చూపిన చొరవ అభినందనీయం. మల్టిపుల్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారిగా..
చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని.. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు.