Engineering Admissions: ఐఐటీలు, నిట్‌ల్లో అడ్మిషన్స్ ప్రారంభం.. ఆన్‌లైన్ విధానంలో జోసా కౌన్సెలింగ్
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌లు, ఇన్‌స్టిట్యూట్స్ ప్రాథమ్యాలను అప్రమత్తంగా పేర్కొనడమే! దాని ఆధారంగా.. ఆటోమేటిక్‌గా సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో..జోసా–2024 కౌన్సెలింగ్ ప్రక్రియ, ఇన్‌స్టిట్యూట్స్, సీట్లు, అర్హతలు తదితర వివరాలు..
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్‌టీఐలలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ తదితర ప్రోగ్రామ్‌లతో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ విధానమే.. జోసా కౌన్సెలింగ్. ఈ ఏడాది 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు సహా మొత్తం 121 ఇన్‌స్టిట్యూట్స్‌లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్, నిట్‌లు తదితర ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్స్‌కు జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
Degree Course Admissions: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్శిటీలో ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జోసా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులు తప్పనిసరిగా.. జోసా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తమ వివరాలు పొందుపరచాలి. ఆ తర్వాత తమ ఆసక్తి మేరకు కోర్సు, ఇన్‌స్టిట్యూట్ ప్రాథమ్యాలను ఆన్‌లైన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. ఇలా ప్రాథమ్యాలను పేర్కొనడాన్నే ఛాయిస్ ఫిల్లింగ్ అని పిలుస్తారు. ఆన్‌లైన్‌లో ప్రాథమ్యాలను పేర్కొన్న తర్వాత.. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్.. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు.. ఒక విద్యార్థి మొదటి ప్రాథమ్యంగా ఐఐటీ–ముంబైలోని సీఎస్‌ఈ బ్రాంచ్‌ను, రెండో ప్రాథమ్యంగా ఐఐటీ–ఢిల్లీలోని సీఎస్‌ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటే.. ఆ విద్యార్థి పొందిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ–ముంబైలో సీటు లభించకపోతే.. ఐఐటీ–ఢిల్లీలోని సీటుకు పరిగణనలోకి తీసుకుంటారు.ఇలా అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులు మొత్తం 23 ఐఐటీల్లో తమకు ఆసక్తి ఉన్న కోర్సు, ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది.
Job Mela 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ బ్యాంకుల్లో మేనేజర్ పోస్టులు
రిజిస్ట్రేషన్ టు ఛాయిస్ ఫిల్లింగ్
జోసా ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ముందుగా జోసా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, లాగిన్–ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రోగ్రామ్‌లు, సీట్లును బేరీజు వేసుకుంటూ.. తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఇలా ఆన్‌లైన్‌లో నిర్దేశిత గడువు తేదీలోగా ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు.. ముందుగా వారిచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా మాక్ సీట్ అలొకేషన్ (నమూనా సీటు కేటాయింపు) వివరాలను అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల వివరాలు తెలుస్తాయి. మాక్ సీట్ అలొకేషన్ జాబితాను బేరీజు వేసుకున్న విద్యార్థులు..
తమ ర్యాంకుకు ఇంకా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వస్తుందనుకుంటే.. తమ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ఇలా.. రెండుసార్లు మాక్ సీట్ అలొకేషన్ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. మాక్ సీట్ అలొకేషన్ చూసుకుని ఆప్షన్లను మార్చుకునేందుకు గడువు ఇస్తారు. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Vacancies In High Courts: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
ఆరు రౌండ్లలో కౌన్సెలింగ్
- జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆరు రౌండ్లలో జరుగుతుంది. అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు.
- మొదటి రౌండ్‌లో లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌పై ఆసక్తి లేకపోతే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు తమ దరఖాస్తును పరిగణించే విధంగా.. తదుపరి రౌండ్లలో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకోసం ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్‌లను ఎంచుకోవచ్చు.
- ఫ్రీజ్: విద్యార్థులు తొలి రౌండ్‌లోనే తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్, ప్రోగ్రామ్‌తో సంతృప్తి చెందితే ఫ్రీజ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో తదుపరి రౌండ్లకు విద్యార్థుల ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకోరు. తొలిదశలో సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే సీట్ యాక్సెప్టెన్స్ తెలియజేయాల్సి ఉంటుంది.
- ఫ్లోట్: మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు నచ్చకపోతే.. మరింత మంచి ఇన్‌స్టిట్యూట్ లేదా బ్రాంచ్ కోసం ఫ్లోటింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఆ విద్యార్థి ప్రాథమ్యాలను మిగతా రౌండ్లకు పరిగణనలోకి తీసుకుంటారు.
- స్లైడ్: మొదటి రౌండ్‌లోనే నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక బ్రాంచ్‌లో సీటు వచ్చిన విద్యార్థి.. అదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో బ్రాంచ్‌లో సీటు కోరుకుంటే.. స్లైడింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇలా ఫ్లోటింగ్, స్లైడింగ్ ఆప్షన్‌లు పేర్కొనడం వల్ల అభ్యర్థులకు చివరగా కేటాయించిన సీట్లే ఖరారవుతాయి. తొలిదశలో లేదా అంతకుముందు దశల్లో వచ్చిన సీట్లు రద్దవుతాయి.
Posts at NPCIL : ఎన్‌పీసీఐఎల్‌లో 58 అసిస్టెంట్ గ్రేడ్–1 పోస్టులు.. అర్హులు వీరే..
ఆన్‌లైన్‌లో సీటు కేటాయింపు
జోసా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న విద్యార్థులు ఎంచుకున్న ప్రాథమ్యాలు, పొందిన ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్‌లోనే సీటు కేటాయిస్తారు. జోసా ప్రక్రియలో పాల్గొన్న విద్యార్థులు తమకు కేటాయించిన సీటుకు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే సీటు రద్దవుతుంది. మొత్తం ఆరు రౌండ్లలో జరిగే సీటు అలొకేషన్ ప్రక్రియలో భాగంగా.. ప్రతి రౌండ్ సీట్ అలొకేషన్ తర్వాత నిర్దిష్ట గడువు తేదీలోగా సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుంది.
యాక్సెప్ట్, విత్‌డ్రా అవకాశం
జోసా ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో యాక్సెప్ట్, విత్ డ్రా అవకాశం ఉంది. సీట్లు లభించిన విద్యార్థులు.. ప్రతి రౌండ్ తర్వాత సీటు యాక్సప్టెన్స్ లేదా ఉపసంహరణ విషయాన్ని స్పష్టం చేయాలి. మొత్తం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో అయిదో రౌండ్ వరకే ఉపసంహరణ అవకాశం ఉంటుంది. అంటే.. అయిదో రౌండ్ సీట్ అలొకేషన్‌ను చూసుకుని అప్పుడు మాత్రమే ఉపసంహరణ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. చివరి రౌండ్ (ఆరో రౌండ్)లో ఈ ఉపసంహరణ అవకాశం ఉండదు.
Schools and Colleges Holiday On June 17th : రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకంటే..!
సీట్ యాక్సప్టెన్స్ ఫీజు
జోసా కౌన్సెలింగ్ విధానంలో సీటు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజును చెల్లించాలి. దీన్ని కూడా ఆన్‌లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ ఈ–చలాన్ రూపంలో మాత్రమే చెల్లించాలి. ఐఐటీల్లో సీటు పొందిన జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.35 వేలు; ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్లు్యడీ విద్యార్థులు రూ.17,500 వేలు చొప్పున యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాలి. తర్వాత దశలో చివరగా తాము ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌కు అనుగుణంగా అకడమిక్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అకడమిక్ ఫీజుల్లోంచి అప్పటికే చెల్లించిన యాక్సెప్టెన్స్ ఫీజును మినహాయిస్తారు.
వినూత్న కోర్సులు
ఐఐటీల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జికల్ వంటి కోర్సులతోపాటు ఏఐ అండ్ ఎంల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటితోపాటు ఇటీవల కాలంలో పలు ఐఐటీలు మెడ్‌టెక్ కోర్సులను సైతం అందిస్తున్నాయి. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోసైన్స్ వంటి కోర్సులు ఉన్నాయి.
UPSC Civils Services Prelims 2024 CSAT Question Paper : యూపీఎస్సీ 2024 సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్-2 సీశాట్ కొశ్చన్ పేపర్ ఇదే.. ఈసారి ప్రశ్నలు ఇలా..!
వేల సంఖ్యలో సీట్లు
- 23 ఐఐటీల్లో 17,740 సీట్లు.
- 32 ఎన్‌ఐటీల్లో 24, 229 సీట్లు.
- 26 ట్రిపుల్ ఐటీల్లో 8,546 సీట్లు.
- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 40 ఇతర సాంకేతిక ఇన్‌స్టిట్యూట్స్‌లో 9,402.
జోసా– 2024.. ముఖ్య తేదీలు:
- జూన్ 10: జోసా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ప్రారంభం.
- జూన్ 15: మాక్ సీట్ అలొకేషన్(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–1 విడుదల. (జూన్ 14 రాత్రి పది గంటల వరకు అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా దీన్ని విడుదల చేస్తారు.)
- జూన్ 17: మాక్ సీట్ అలొకేషన్ (సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–2 విడుదల. (ఈ జాబితాను జూన్ 16 సాయంత్రం అయిదు గంటల వరకు పేర్కొన్న ప్రాథ్యమాల ఆధారంగా వెల్లడించనున్నారు).
- జూన్ 18: ఛాయిస్ ఫిల్లింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ.
- జూన్ 19: వివరాల పునస్సమీక్ష, పరిశీలన.
- జూన్ 20: మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూన్ 20–24: మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలి. అదే విధంగా యాక్సప్టెన్స్ ఫీజును చెల్లించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- జూన్ 27: రెండో దశ సీట్ల కేటాయింపు
- జూన్ 27– జూలై 1: రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్. అదే విధంగా.. రెండో రౌండ్‌లో పొందిన సీటు విషయంలో ఉపసంహరణ లేదా
కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి విరమించుకునే అవకాశం.
UPSC Civils Services 2024 Prelims Paper 1 Answer Key : యూపీఎస్సీ 2024 సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్-1 జనరల్ స్టడీస్ ఆన్సర్ కీ ఇదే.. ఈసారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..
- జూలై 4: మూడో రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూలై 4–8: మూడో రౌండ్ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ అప్‌లోడ్.
- జూలై 5: మూడో రౌండ్ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి ఉపసంహరణ.
- జూలై 10: నాలుగో రౌండ్ సీట్ల కేటాయింపు.
- జూలై 10–15: నాలుగో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ అప్‌లోడ్.
- జూలై 11–15: నాలుగో రౌండ్ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్ నుంచి ఉపసంహరణ అవకాశం.
- జూలై 17: అయిదో రౌండ్ సీట్ల కేటాయింపు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి అయిదో రౌండ్‌ను చివరి రౌండ్‌గా పేర్కొన్నారు.
- జూలై 17–22: అయిదో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ అప్‌లోడ్, ఫీజు పేమెంట్.
- జూలై 17–23: ఎన్‌ఐటీ+ సిస్టమ్ పేరుతో ఎన్‌ఐటీల్లో సీట్ల కేటాయింపు రౌండ్.
- జూలై 24–జూలై 26: ఎన్‌ఐటీ + సిస్టమ్ విధానంలో పొందిన సీటుకు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://josaa.nic.in
Tags
- engineering students
- admissions
- Online Counselling
- IIT and NIT
- Engineering courses
- JEE Mains and Advanced Rankers
- Joint Seat Allocation Authority
- counselling
- certificates verification
- Education News
- Sakshi Education News
- Engineering Admissions
- Admissions process
- Seat allocation
- JEE-Mains
- JEE-Advanced
- IIT admissions
- NIT Admissions
- JOSHA
- Online counseling
- engineering colleges
- higher education