Employees: జీతమా... ప్రశాంతతనా..? ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారంటే...
ప్రశాంతతకే ఓటు
జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
చదవండి: 3 వేల కోట్లతో అమెరికన్ కాన్సులేట్... ఇకపై వీసాలన్నీ అక్కడి నుంచే
అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు
మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు.
చదవండి: ఇకపై ఎప్పుడైనా 180 రోజుల లీవ్... కానీ, వీరికి మాత్రమే
భారత్‌లో ఇలా....
- పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు
- ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు.
- 71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
- వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్నవారు 62% మంది.
- కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న వారు 46% మంది.
- పని ఒత్తిళ్లతో సాయంత్రానికి ఉత్సాహం కోల్పోతున్నామని 26% మంది చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే...
- ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
- అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు.
- తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు.
- తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు.