Skip to main content

American consulate: 3 వేల కోట్ల‌తో అమెరిక‌న్ కాన్సులేట్‌... ఇక‌పై వీసాల‌న్నీ అక్క‌డి నుంచే

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ అత్యాధునిక హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి మారింది. నానక్‌రామ్‌గూడలో నిర్మించిన‌ శాశ్వత అమెరికన్‌ కాన్సులేట్‌ భవనంలో సోమవారం నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయని కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్ తెలిపారు. భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో మైలురాయి అని ఆమె పేర్కొన్నారు.
American consulate
American consulate

వీసాల జారీని సులభతరం చేసేందుకు ఇక్కడ అధికారుల సంఖ్యను మ‌రింత పెంచుతున్నామన్నారు.
2800 కోట్ల‌తో నిర్మాణం...
హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు అమెరికా ప్రతినిధిగా వ్యవహరింది. 2008లో హైదరాబాద్‌లో తొలిసారి అమెరికన్‌ కాన్సులేట్‌ ప్రారంభమైంది. ఇప్పటివరకూ అది బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి త‌న హయాంలోనే శాశ్వత భవన నిర్మాణం కోసం నానక్‌రామ్‌ గూడలో సుమారు 12 ఎకరా­ల స్థలం కేటాయించారు. అందులోనే అమెరికా 34 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది.

చ‌ద‌వండి: ఇక‌పై ఎప్పుడైనా 180 రోజుల లీవ్‌... కానీ, వీరికి మాత్ర‌మే
చిరునామా: సర్వే నంబరు 115/1, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌ గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. 
- అత్యవసర కాన్సులర్‌ సేవల కోసం (అమెరికా పౌరులైతే) +91 040 6932 8000 నంబరులో సంప్రదించవచ్చు. 
- సాధారణ సేవల కోసం ‘‘HydACS@state.gov.’’ఐడీకి మెయిల్‌ చేయవచ్చు.  
- వీసా ఇంటర్వ్యూలు నిర్దిష్ట సమయాల్లో నానక్‌రామ్‌ గూడలోని కొత్త కార్యాలయంలో జరుగుతాయి. 
- వీసాలకు సంబంధించిన ఇతర సర్వీసులు (బయోమెట్రిక్స్, అపాయింట్‌మెంట్స్, ‘డ్రాప్‌బాక్స్‌’పాస్‌పోర్ట్‌ పికప్, అపాయింట్‌మెంట్స్‌ (ఇంటర్వ్యూ వెయివర్‌)లు మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘వీసా అప్లికేషన్‌ సెంటర్‌’లో కొనసాగుతాయి. 
- కాన్సులర్‌ సేవలకు సంబంధించిన ప్రశ్నల కోసం +91 120 4844644, +91 22 62011000 నంబర్లలో సంప్రదించవచ్చు.

Published date : 21 Mar 2023 05:07PM

Photo Stories