New Norms For Coaching Institutes- కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సిందేనా? ఎలాంటి మార్పులు అవసరం?
ఆ వయస్సు వాళ్లను చేర్చుకోరాదు
దీని ప్రకారం.. 16 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్నవారిని కోచింగ్ సెంటర్లలో చేర్చుకోరాదు. సెకండరీ పాఠశాల విద్య పూర్తిచేసిన వారిని మాత్రమే కోచింగ్ సెంటర్‌లో అనుమతించాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ర్యాంకులు, మారుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
ఉల్లింఘిస్తే లైసెన్స్ రద్దు
కోచింగ్ టైమింగ్స్‌ను పరిమితం చేయడం, మౌలిక సదుపాయాలు, ఫీజుల్లో పారదర్శకత మొదలగు అంశాలపై మార్గదర్శకాలను రూపొందించింది. నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు చదువుల ఒత్తడిని ఎలా తట్టుకోవాలి? ఉద్యోగం సంపాదించాలంటే కోచింగ్ సెంటర్స్‌పై ఆధారపడాల్సిందేనా? విద్యా విధానంలో ఎలాంటి మార్పులు అవసరం వంటి వాటి విషయాలపై BITS పిలానీ క్యాంపస్ గ్రూప్ వైస్-ఛాన్సలర్, IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ V రాంగోపాల్ రావు మాటల్లోనే...
1. కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో పరిమిత సీట్లు ఉండటంతో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టడీ-నౌ-పే లేటర్ వంటి పథకాలు, వివిధ నగరాల్లో క్యాంపస్‌ల విస్తీకరణ, మల్టీ ఇన్‌స్టిట్యూషన్ సహా ప్రతి ఏడాది సీట్లు పెంచుకునేలా సరైన ప్రణాళిక రూపొందించాలి.
వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలి
2. కోచింగ్ సెంటర్ల కంటే ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. JEE ప్రిపరేషన్ కోసం అందిస్తున్న IIT ప్రొఫెసర్ అసిస్టెడ్ లెర్నింగ్ (PAL) వంటి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు ఎంతో సక్సెస్ అయ్యాయి. వీటిని మరింత ఎక్కువగా విద్యార్థులకు అందివ్వగలగాలి. నాణ్యమైన కంటెంట్‌తో,ఆన్‌లైన్‌లోనే సెషన్స్ నిర్వహిస్తే ఫిజికల్ కోచింగ్ సెంటర్లపై ఆధారపడటం తగ్గుతుంది.
3. ప్రొఫెసర్లు అత్యుత్తమంగా క్లాసులు చెబితే అసలు కోచింగ్ సెంటర్లతో పనేముంటుంది? అందుకే అద్యాపకులే నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయవచ్చు. క్లాస్‌రూం ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వగలిగితే కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
తప్పుడు లెక్కలు.. ప్యాకేజింగ్‌తో మతలబు
4. చాలా వరకు ఇన్‌స్టిట్యూట్‌లలో.. ప్లేస్‌మెంట్స్, ప్యాకేజీల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తుంటారు. తాము అందించిన ట్రైనింగ్ వల్లే విద్యార్థులకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు వచ్చాయన్నట్లు అవాస్తవాలను హైలైట్ చేస్తుంటారు. ఇది మిగతా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కూడా ప్రభావం చూపెడుతుంది. ఫలితంగా టీవీల్లో, పేపర్లలో వచ్చిన ప్రకటనల ప్రకారం కోచింగ్ సెంటర్లను గుడ్డిగా నమ్మేసి లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి అసత్యపు ప్రచారాలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
5. ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో మరింత పారదర్శకత అవసరం. కోచింగ్ సెంటర్స్‌లో చాలావరకు విషయాన్ని పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పడం కంటే,తక్కువ సమయంలో, ట్రిక్స్ ద్వారా సమాధానాలు గుర్తించే టెక్నిక్స్‌ను నేర్పిస్తుంటారు. దీనివల్ల సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఏర్పడదు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లు మరింత పారదర్శకంగా, వాస్తవితకతను ప్రతిబింబేలా రూపొందించాలి.
6. ఈరోజుల్లో చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా కెరీర్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకే పంథాలో కెరీర్‌ను ఎంచుకోవడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. అందుకే లేటెస్ట్ అప్‌డేట్స్, ఇప్పుడున్న మార్కెట్ ఆధారంగా ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అన్న దానిపై అవగాహన ఏర్పరుచుకోవాలి. మీకు ఏ సబ్జెక్ట్స్‌లో పట్టు ఉందో దానిపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ప
కోచింగ్ సెంటర్లపై ఎక్కువగా ఆధారపడకుండా విద్యా పెంపొందించడం, ఆన్‌లైన్ ట్యూటరింగ్ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఉపాధ్యాయ శిక్షణ, పరీక్షా విధానంలో కొత్త మార్పుల అవంలంభించడం వంటి విషయాలపై దృష్టి పెడితే ఒత్తిడి లేని చదువుకు మార్గం సుగుమం అవుతుంది.