Skip to main content

Education System: విద్యా సంస్కరణల ఆద్యుడు సీఎం జగన్‌

Major changes brought in education sector for better future

నగరి: విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి పలు సంస్కరణలు చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యుత్‌, అట వీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జగనన్న విద్యా దీవెన త్రై మాసిక లబ్ధి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని నగరి నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం బహిరంగ సభ, హెలీప్యాడ్‌ వద్ద శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లను డిప్యూ టీ సీఎం కె.నారాయణస్వామి, రాష్ట్ర ప ర్యాటక, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశీల రఘురాం, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌, ఎస్పీ వై.రిశాంత్‌ రెడ్డితో కలిసి ఆ యన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నగరి నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేలా అందరి సమన్వయంతో విజయవంతం చేస్తామన్నారు. ము ఖ్యమంత్రి ఎన్నికల హామీలను 99 శాతం పూర్తి చేశారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రభు త్వం అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్‌, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆదిమూలం, డీఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖరరెడ్డి, జెడ్పీసీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో లక్ష్మి, డీపీఎంఓ షణ్ముగం, నగరి, కుప్పం ఆర్డీఓలు సుజన, శివయ్య, తహశీల్దార్‌ చంద్ర శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంక్రటామిరెడ్డి, ఎంపీడీవో లీలామాధవి, ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

చదవండి: Jagananna Vidya Deevena: నేడు జగనన్న విద్యా దీవెన

Published date : 28 Aug 2023 03:08PM

Photo Stories