Skip to main content

Lion Club Trust: విద్యార్థుల ప్రోత్సాహానికే ఈ ట్ర‌స్టు

విద్యార్థుల కోసం నిర్వ‌హించిన ఈ ట్ర‌స్ట్ లో ఆదివారం జ‌రిపిన కార్య‌క్ర‌మంలో చైర్మ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ట్ర‌స్టును నిర్వ‌హించేందుకు గ‌ల కార‌ణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. అంతే కాకుండా విద్యార్థులకు త‌గిన ప్రోత్సాహాన్ని అందించారు. చైర్మ‌న్ మాట్లాడిన మాట‌లు ఏమిటో తెలుసుకుందాం..
Lion Club Trust members with the students
Lion Club Trust members with the students

సాక్షి ఎడ్యుకేష‌న్: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు లయన్స్‌ క్లబ్‌ ట్రస్టు ఏర్పాటు చేసిందని ట్రస్టు జిల్లా చైర్మన్‌ దాసరి తిరుమలరావు తెలిపారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా క్లబ్‌ సభ్యులు ప్రత్యేక విద్యానిధి ద్వారా వచ్చే వడ్డీతో ఏటా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారని తెలిపారు.

Students to UNO: ఐక్య‌రాజ్య స‌మితిలో రాష్ట్ర విద్యార్థులు

సామర్లకోట, కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేట, యానాం, తాళ్లరేవు, అమలాపురం ప్రాంతాల్లో ఇంటర్‌ నుంచి ఇంజినీరింగ్‌ వరకూ చదువుతున్న 74 మంది విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకూ ఆర్థిక సాయం, ఐదుగురికి ల్యాప్‌టాప్‌లు అందజేశారు. మొత్తం రూ.8 లక్షల విలువైన వితరణ చేశారు. లయన్స్‌ క్లబ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, పేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో లయన్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశారని అన్నారు.

​​​​​​​APPSC Examinations: ఆన్‌లైన్ విధానంలో ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లు

లయన్స్‌ క్లబ్‌ స్థానిక అధ్యక్షుడు కానుబోయిన విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏలూరి సత్యనారాయణ, ట్రస్టు కార్యదర్శి కాటూరి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు చిట్టునేడి శ్రీనివాసు, కోశాధికారి ఉమామహేశ్వరరావు, సహాయ కోశాధికారి శ్యామ్‌, క్లబ్‌ ఉప గవర్నర్‌ ఈదల ఈశ్వరకుమార్‌, జిల్లా చైర్మన్‌ చిత్తూరి వీర్రాజు, క్లబ్‌ కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

Published date : 25 Sep 2023 03:26PM

Photo Stories