Government Schools: ప్రభుత్వ బడులను కాపాడుకుందాం
మోతె: మన ఊరిలోని ప్రభుత్వ బడులను కాపాడుకుందామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడుల పరిరక్షణకు గురువారం మోతె మండల పరిధిలోని రావిపహడ్ గ్రామంలో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో తల్లిదండ్రులు, యువకులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అభివృద్ధికి పాటుపడాలన్నారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్‌రావు, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి, గ్రామ సర్పంచ్ శ్యామలేటి కోటేష్, ఉపసర్పంచ్ కాకి మోహన్‌రెడ్డి, యూటీఎఫ్ నాయకుడు సీహెచ్ వీరారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి, మోతీలాల్, ఉపాధ్యాయులు శీనయ్య, నరేందర్ పాల్గొన్నారు.