Work from Hometown: వర్క్ ఫ్రమ్ హోమ్‌టౌన్ పైలట్ ప్రాజెక్టు కేంద్రాలు ప్రారంభం
కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఉద్యోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఉపశమనంగా ఉంటాయన్నారు. ఇంత త్వరగా ఈ పైలట్ ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఐటీ, ఏపీఎస్‌ఎస్డీసీ, ఏపీఎన్‌ఆరీ్ట, ఏపీఐఎస్, ఏపీఎస్సీహెచ్‌ఈ విభాగాల కృషిని మంత్రి అభినందించారు. అలాగే, డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ అధికారిక వెబ్‌సైట్‌ను విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి ప్రారంభించారు. కోవిడ్ పరిస్థితుల్లో స్వగ్రామాలకు వెళ్లిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయాలు, కొన్నిచోట్ల ఆఫీస్ వాతావరణం సరిగ్గాలేక ఇబ్బందిపడ్డారని, అలాంటివారికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే స్పందన బట్టి మారుమూల ప్రాంతాల్లోనూ వీటి అవసరాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.5 వేలు మాత్రమే ఖర్చవుతుందని.. అదే మిగతా పట్టణాల్లో రూ.4వేలు ఖర్చవుతుందన్నారు. ఒక్కోచోట 30 మంది కూర్చుని పనిచేసుకునేలా వీటిని తీర్చిదిద్దామన్నారు. భవిష్యత్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలుగా 102 సీఎం ఎక్స్‌లెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఏపీఐఎస్, ఏపీఐఐసీ కేంద్రాలను వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చనున్నట్లు చెప్పారు. ఈ సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తిగల ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 9988853335 నంబర్ లేదా.. http://www.apita.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
చదవండి:
Supreme Court : వారం రోజులు పాటు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి..