Jagananna Videshi Vidya Deevena Application : జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఈ పథకం కింద ప్రపంచంలో టాప్-200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Jaganna Videshi Vidya Deevena : ఏపీ విద్యార్థుల కోసం మరో సంచలన పథకం.. ఉండాల్సిన అర్హతలు ఇవే..
అర్హతలు ఇవే..
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్‌ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెపె్టంబర్ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు: ఫీజులపై ఒత్తిడి చేయొద్దు