Inter Exams Latest News: ఈసారి 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు..ఈ నిబంధనలు తప్పనిసరి
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.70 శాతం సిలబస్‌తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు.
అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు..మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 25వ తేదీ నుంచి జరగనున్నాయి. రెండో సంవత్సరంలో కాలేజ్ మారిన విద్యార్థి, మొదటి సంవత్సరంలో ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని తెలిపారు.
Published date : 12 Oct 2021 08:03PM