Gurukul Principal: గురుకుల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
Sakshi Education
లింగాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నాను సస్పెన్షన్ చేస్తూ గురువారం రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 10న రాత్రి కళాశాల ఆవరణలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి, అక్టోబర్ 11న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కుల సంఘాలతో కలిసి రాస్తారోకో చేసిన విషయం విధితమే. ఈ ఘటనకు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణంగా గుర్తిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వైస్ ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు.
చదవండి: Tribal students: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి
Published date : 13 Oct 2023 03:43PM