Google: ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చిన గూగుల్... ఇకపై అవన్నీ కుదరవు..!
అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది.
చదవండి: పాపం అయ్యా పిచాయ్... నిండు గర్భిణిలకూ షాక్ ఇస్తే ఎలా
అన్నీ వెనక్కి ఇచ్చేయండి..!
గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస‍్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్‌ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్‌ట్యాప్‌లను వెనక్కి తీసుకుంటోంది.
చదవండి: తొలగింపుల్లోనూ పోటీ... ఆటంబాంబు పేల్చిన గూగుల్..
సర్దుకోండి..!
మైక్రో కిచెన్‌ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్‌నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడంతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అయితే ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తామని, వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేస్తున్నామని గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్‌మోడోకి చెప్పారు.