PG ECET 2022: ఇంజనీరింగ్ పీజీసెట్ దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఇంజినీరింగ్ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్–2022 దరఖాస్తుల స్వీకరణ గడువును అపరాధ రుసుములేకుండా జూలై 10 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొ.లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇంజినీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతవరకు 11,937 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
Published date : 02 Jul 2022 06:31PM