Skip to main content

Education ministry: జాతీయ విద్యావిధానానికి మ‌రిన్ని మెరుగులు... ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌తో 106 ఒప్పందాలు... ఇక‌పై విద్యార్థుల‌కు

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: జాతీయ విద్యావిధానం-2020 మేర‌కు విద్య‌ను మ‌రింత బ‌లోపేతం చేసేదిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ఉపాధ్యాయుల శిక్షణ, వారిలో నైపుణ్యాలాభివృద్ధి కోసం వివిధ సంస్థ‌ల‌తో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.
Education ministry: జాతీయ విద్యావిధానానికి మ‌రిన్ని మెరుగులు... ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌తో 106 ఒప్పందాలు... ఇక‌పై విద్యార్థుల‌కు
జాతీయ విద్యావిధానానికి మ‌రిన్ని మెరుగులు... ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌తో 106 ఒప్పందాలు... ఇక‌పై విద్యార్థుల‌కు

పరిశ్ర‌మ‌ల డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌ను విద్యార్థుల‌లో పెంపొందించేందుకు వీలుప‌డ‌నుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

ఇవీ చ‌ద‌వండి: టీఎస్‌ సెట్-2023 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీలు ఇవే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

పలు ప్రఖ్యాత కంపెనీలు, విద్యా సంస్థలతో ఆవిష్కరణ, పరిశోధన, విజ్ఞాన మార్పిడికి సంబంధించి జులై 30న‌ కేంద్ర విద్యాశాఖ 106 ఒప్పందాలను (ఎంవోయూలు) చేసుకుంది. నూతన విద్యా విధానం(2020) మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సమాగమం ముగింపు కార్యక్రమంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 

NEP

నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీబీఎస్‌ఈ 15 ఒప్పందాలను చేసుకుంది. ఈ ఒప్పందాలు అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, ఐబీఎం, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌లతోపాటు దుస్తుల తయారీ, హోం డెకార్‌, ఆటోమోటివ్‌, క్రీడలు, వ్యాయామ విద్య, లాజిస్టిక్స్‌, ఆరోగ్య రంగాల్లోని సంస్థలతో జరిగాయి. 

ఇవీ చ‌ద‌వండి:   టీఎంసీతో 15 రోజులపాటు హైదరాబాద్ దాహార్తి తీర్చొచ్చు... ఒక టీఎంసీకి ఎన్ని ల‌క్ష‌ల లీట‌ర్లంటే

జవహర్‌ నవోదయ విద్యాలయాల సంస్థ, ఐబీఎంల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్‌సీఈఆర్‌టీ 20 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఏఐసీటీఈ పలు టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. పీఎం- ఉషా ఇనీషియేటివ్‌ కింద దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు అమెరికా, కజక్‌స్థాన్‌, మలేసియా, బ్రెజిల్‌ దేశాల్లో వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. 

NEP

ఇవీ చ‌ద‌వండి : ఆ మెడిక‌ల్ కాలేజీకి వెబ్ ఆప్ష‌న్ ఇచ్చారా... అయితే మీ సీటు గోవిందా...!

డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఫౌండ్రీ పరిశ్రమ ఆటోమేషన్‌లో అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌, శిక్షణ కోసం తిరుపతిలోని ఐఐటీ, ఐఐఎఫ్‌సీఈటీల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్లొమా హోల్డర్లకు, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి వారి నాలెడ్జిని బలోపేతం చేయడం దీని ఉద్దేశం. స్మార్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, విద్యుత్తు వాహనాల టెక్నాలజీకి సంబంధించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు తిరుపతి ఐఐటీ, సీమెన్స్‌ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.

Published date : 31 Jul 2023 02:06PM

Photo Stories