TMC, Cusec: టీఎంసీతో 15 రోజులపాటు హైదరాబాద్ దాహార్తి తీర్చొచ్చు... ఒక టీఎంసీకి ఎన్ని లక్షల లీటర్లంటే
ఈ మాటలు వానాకాలంలో తరుచుగా వింటూనే ఉంటాం. నీటి నిల్వను టీఎంసీలలో.. నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి చెప్పాలనుకున్నప్పుడు క్యూసెక్కులలో చెబుతారు.
టీఎంసీ (TMC) : ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పడానికి ఉపయోగించే ప్రమాణం ఇది. TMC అంటే THOUSAND MILLION CUBIC FEET అని అర్థం. శతకోటి ఘనపుటడుగులు అని అర్థం. ఒక టీఎంసీ అంటే 2,80,00,000 క్యూబిక్ మీటర్లు.
ఇవీ చదవండి : ఆ మెడికల్ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చారా... అయితే మీ సీటు గోవిందా...!
క్యూసెక్కు (CUSEC) : క్యూసెక్కు అంటే సెకను కాలంలో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అని అర్థం. CUBIC FEET PER SECOND అని అర్థం. ఒక సెకను వ్యవధిలో ఘనపుటడుగుల నుంచి ప్రవహించే నీరు 28 లీటర్లు. ఏదైనా ఒక రిజర్వాయరు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంటల పాటు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది.
ఒక టీఎంసీ నీరు అంటే దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్ (సుమారు 70 లక్షల జనాభా)ఉపయోగించే నీటితో సమానం · నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటి 400 టీఎంసీలు. అంటే దాదాపు 17 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి సరిపోయెంత నీరు అని అర్థం· ఒక లక్ష క్యూసెక్కుల నీరు ఒక రోజంతా(24గంటలు) సముద్రం లోకి వదిలారంటే నాలుగు న్నర నెలల పాటు హైదరాబాద్ నగరం ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అర్థం.
ఇవీ చదవండి : డిజి లాకర్‌లో పత్రాలుంటే... ఇక ఒరిజినల్స్ వెంటపట్టుకురావాల్సిన అవసరం లేనట్లే...!
22000 క్యూసెక్కుల నీరు ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే ఒక నెల పాటు హైదరాబాద్ నగరం ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అర్థం. 700 క్యూసెక్కుల నీరు ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే ఒక రోజు హైదరాబాద్ నగరం ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రంలోకి వెళ్లిపోయిందని అర్థం.
ఒక టీఎంసీ అంటే 28,316,846,592 లీటర్లతో సమానం
అలాగే ఒక క్యూసెక్కు అంటే 28,317 లీటర్లతో సమానం.