Skip to main content

DigiLocker: డిజి లాక‌ర్‌లో ప‌త్రాలుంటే... ఇక ఒరిజిన‌ల్స్ వెంట‌ప‌ట్టుకురావాల్సిన అవ‌స‌రం లేనట్లే...!

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఇప్పుడంతా టెక్నాల‌జీ యుగం న‌డుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు స‌మ‌స్త‌మంతా అర‌చేతిలో ఒదిగిపోయిన‌ట్లే. ఇదివ‌ర‌కు ఏవైనా ఒరిజిన‌ల్ ధ్రువ ప‌త్రాలు అవ‌స‌ర‌మైతే వాటిని త‌ప్ప‌నిస‌రిగా వెంట‌పెట్టుకుపోవాల్సి వ‌చ్చేది.
DigiLocker
DigiLocker

జిరాక్స్ తీసుకోవాలంటే సంబంధిత ప‌త్రాల‌ను వెంట‌పెట్టుకుపోవాల్సిందే. కానీ, ప్ర‌స్తుతం ఇలాంటివాటికి చెక్ ప‌డింది. 

డిజిలాక‌ర్‌... ఒకే ఒక యాప్ హార్డ్ కాపీల‌కు చెక్ చెబుతోంది. డిజిలాక‌ర్‌లో మ‌న ఆధార్‌, డ్రైవింగ్ సైసెన్స్‌, పాస్‌పోర్టు, విద్యార్హ‌త ప‌త్రాలు... ఇలా ఏ ప‌త్రాల‌నైనా పొందుపరుచుకోవ‌చ్చు. డిజిలాక‌ర్ నుంచి డైరెక్ట్‌గా పాస్‌పోర్టు వెరిఫికేష‌న్ కోసం ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేసేందుకు అనుమ‌తి ల‌భించింది. దీంతో ఇక‌పై పాస్‌పోర్టు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ కోసం అపాయింట్‌మెంట్‌ ఉన్న రోజున డైరెక్ట్‌గా వెళ్లి ఓ ఫొటో దిగొస్తే చాలు. వెరిఫికేష‌న్ అంతా పూర్త‌యిపోతుంది. 

IAS Officers : దేశానికి అత్యధికంగా 'ఐఏఎస్' ఆపీస‌ర్ల‌ను ఇచ్చే రాష్ట్రం ఇదే..?

digilocker

భౌతికంగా ధ్రువపత్రాలు అందించడంలో ఎదురయ్యే సమస్యలకు చెక్‌ పెడుతూ విదేశాంగశాఖ డిజి లాకర్‌ ద్వారా పత్రాల అప్‌లోడింగ్‌కు తాజాగా అనుమతించింది. దీంతోపాటు ఈ-ఆధార్‌కూ అనుమతి లభించింది. ఇప్ప‌టివ‌ర‌కు పాస్‌పోర్టు కోసం వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిందే. కేంద్రం తాజా నిర్ణ‌యంతో డిజీలాక‌ర్‌లో ప‌త్రాలుంటే చాలు ఒరిజిన‌ల్స్‌తో ప‌ని ఉండ‌దు.

Police officer clears NEET UG: డ్యూటీ చేస్తూనే సొంత ప్రిప‌రేష‌న్‌తో మెడిక‌ల్ సీటు సాధించా... నా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా 

డిజిటల్‌ ఇండియాలో భాగంగా డిజిలాకర్ ని కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో వినియోగదారులు తమ పత్రాలను భద్రపరుచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ ద్వారా ఖాతా తెరవవచ్చు. డిజిలాకర్‌ ఉంటే డాక్యుమెంట్లు కాగిత రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

Published date : 29 Jul 2023 01:35PM

Photo Stories