Skip to main content

Digital Education: దివ్యాంగులకు డిజిటల్‌ విద్య

Digital Education for Disabled Students

విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విద్యను చేరువ చేసింది. ఈ ప్రక్రియలో జిల్లాలోని భవిత కేంద్రాల్లో దివ్యాంగుల విద్యకు అవసరమైన ట్యాబ్‌లను అందజేసింది. దీనిలో ప్రత్యేక యాప్‌లు పొందుపరిచి వాటితో విద్యాబోధన చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు, ఐఈఆర్పీలకు కూడా ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆధునిక సాధనాలు వినియోగించుకుంటున్న దివ్యాంగులు బంగరు భవిత దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రత్యేక యాప్‌లతో..
దృష్టి, వినికిడి లోపాలు కలిగిన విద్యార్థులకు సాంకేతికంగా అభివృద్ధి చేసిన యాప్‌లతో కూడిన ట్యాబ్‌లను అందించారు. అంధులు, పాక్షిక అంధులు, బధిరులు, పాక్షిక బధిరులకు వీలుగా టాక్‌బ్యాక్‌(ట్యాబ్‌ను ఏ వైపు ఉపయోగించినా స్పందించే యాప్‌), స్పోకెన్‌ అసిస్టెంట్‌(శబ్ధ సాంకేతికల ద్వారా ట్యాబ్‌ను ఉపయోగించే యాప్‌), విజిబులిటి ఇన్‌ఎన్స్‌మెంట్‌(దృష్టి లోపం ఉన్న వారికి, చిన్నచిన్న విషయాలను స్పష్టంగా చూపడానికి యాప్‌), మిషన్‌ ఏఐ, ‘ఎన్‌’ విజన్‌ యాప్‌లను (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే యాప్‌లు) ట్యాబ్‌లలో పొందుపరిచారు. వీటిని ఇతర అవసరాలకు వినియోగించకుండా ప్రత్యేక లాక్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకావసరాలు ఉన్న బాలబాలికలపై ప్రభుత్వం

చ‌ద‌వండి: 10th Class Exams 2024: కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

శ్రద్ధ చూపిస్తోంది.
పెడన: జిల్లాలోని భవిత కేంద్రాల్లో విద్యార్థులకు డిజిటల్‌ విద్య వారి ముంగిటకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యాసంస్కరణల ఫలితంగా సాంకేతిక విద్య దివ్యాంగులకు చేరువైంది. డిజిటల్‌ చదువుల కోసం ఇప్పటికే 8వ తరగతి విద్యార్థులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్యాబ్‌లను రెండు విడతలుగా అందించారు. తాజాగా భవిత కేంద్రాల్లో (ప్రత్యేకావసరాల పిల్లల వనరుల కేంద్రం) విద్యను అభ్యసించే దివ్యాంగులకు అత్యాధునిక ట్యాబ్‌ల్లో ప్రత్యేక యాప్‌లను అప్‌లోడ్‌ చేయించి ఇచ్చారు. దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతికంగా అభివృద్ధి చేసిన యాప్‌లతో కూడిన ట్యాబ్‌లను అందించి ఎలా వినియోగించాలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్క ట్యాబ్‌ విలువ సుమారు రూ.30 వేలు ఉంది.

జిల్లాలో 25 భవిత కేంద్రాలు
కృష్ణా జిల్లాలో 25 భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయి. మొత్తం 302 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దృష్టి లోపం ఉన్న 14 మందికి, వినికిడి(చెవిటి, మూగ)లోపం ఉన్న 26 మంది విద్యార్థులకు మొత్తం 40 మందికి ట్యాబ్‌లను అందజేశారు. వీరు కాకుండా భవిత కేంద్రాల్లోనే 8వ తరగతి చదువుతున్న సుమారు 25 మంది విద్యార్థులు గత ఏడాది ట్యాబ్‌లను పొందారు. అలాగే జిల్లాలో వివిధ పాఠశాలల్లో 2,247 మంది దివ్యాంగ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

చ‌ద‌వండి: Admission in 5th Class: గురుకులం పిలుస్తోంది.. ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

22 మంది స్కూలు అసిస్టెంట్లు.. 47 మంది ఐఈఆర్పీలకూ ట్యాబ్‌లు
భవిత కేంద్రాల్లోని విద్యార్థులకు పాఠశాల స్థాయిలో పాఠాలను బోధించే స్కూలు అసిస్టెంటు ప్రత్యేక ఉపాధ్యాయులు 22 మందికి కూడా ట్యాబ్‌లను అందజేశారు. వీరు కాకుండా భవిత కేంద్రాల్లో విద్యాబుద్ధులు నేర్పించే ఐఆర్పీలు(ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌) 47 మందికి ట్యాబ్‌లను అందించారు. వీరంతా ఇప్పటికే ట్యాబ్‌లపై శిక్షణ పొందారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్యాబ్‌లను ఎలా వినియోగించాలో, పాఠాలను అర్థం చేసుకునే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న 40 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ ప్రత్యేక యాప్‌లతో భవిత కేంద్రాల్లో డిజిటల్‌ విద్య దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి

sakshi education whatsapp channel image link

Published date : 20 Dec 2023 10:37AM

Photo Stories