Skip to main content

D.ED Exams: డీఎడ్ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల తేదీ విడుద‌ల‌

డీఈఓ నాగ‌రాజు, మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో డీఎడ్ సెమిస్ట‌ర్ పరీక్ష‌ల గురించి వాటి తేదీ గురించి తెలిపారు. ప‌రీక్ష‌లకు హాల్‌టికెట్లు పొందే విధానాన్ని కూడా వివరించారు.
DED  exam dates announced, DEO Nagaraju
D ed exam dates announced

సాక్షి ఎడ్యుకేష‌న్: డీఎడ్‌ మొదటి సెమిస్టర్‌, నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 19 నుంచి 25 వరకు ఉంటాయని డీఈఓ నాగరాజు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెమిస్టర్‌, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నాల్గో సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

Tech Mahindra Free Training: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ!

ఈ నెల 13 నుంచి www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Published date : 13 Sep 2023 03:01PM

Photo Stories