IPC Courses: ఐపీసీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే, స్వీడన్ బీటీహెచ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కొలాబరేటివ్ (ఐపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి విడతలో సీఎస్‌ఈ 15, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్)లో ఇద్దరికి ప్రవేశాలు కల్పించగా గురువారం రెండవ విడతలో సీఎస్‌ఈలో ఐదుగురు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ లెర్నింగ్‌లో 12 మందికి, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీఎస్‌ఈలో ఇద్దరికి అడ్మిషన్లు కల్పించారు. విద్యార్థులకు వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు అడ్మిషన్ల పత్రాలు అందజేశారు.
చదవండి: Admission in Andhra University: పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
Published date : 01 Sep 2023 05:01PM