Admission in Andhra University: పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సంయుక్తంగా బొల్లినేని మెడ్‌స్కిల్స్‌లో వివిధ పీజీ, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల కాలవ్యవధి కలిగిన మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఏదయినా డిగ్రీ పూర్తిచేసినవారు, ఏడాది కాల వ్యవధితో నిర్వహించే పిజీ డిప్లొమా ఇన్‌క్రిటికల్ కేర్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టెక్నాలజీ కోర్సులకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బి ఫార్మశీ, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులు చేసిన వారు అర్హులు. హస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో 40 మందికి, ఇతర కోర్సులకు 15 మందికి ప్రవేశం కల్పిస్తారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు ఏడాదికి రూ.45 వేలు ఫీజుగా, ఇతర కోర్సులకు రూ.50 వేలు కోర్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 8వ తేదీలోగా తమ దరఖాస్తులను ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో అదజేయాలి. దరఖాస్తుతో పాటు సంబంధిత విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లను జతపరచాలి. ఇతర వివరాలకు ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్ www.audoa.in సందర్శించాలని సూచించారు. పూర్తివివరాలు 72079 53919, 76809 45357 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: Para Medical Courses: ఆన్‌లైన్‌లో పారా మెడికల్ కోర్సులకు మెరిట్ జాబితా