IIIT students: ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల స్కిట్‌కు కలెక్టర్ బహుమతి
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు స్కిట్(వీధి నాటకం)కు కలెక్టర్ వరుణ్‌రెడ్డి రూ.10వేల బహుమతి ప్రదానం చేశారు. ఓటు హక్కు ప్రతీ పౌరుని బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం పోటీలు నిర్వహించింది. బాసర ట్రిపుల్‌ఐటీ ఎన్‌ఎస్‌ఎస్ విభా గం విద్యార్థులు ‘ప్రభావం చూపుతుంది’ అనే పేరుతో ఐదు నిమిషాల స్కిట్‌ను నిర్మల్ జిల్లా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది. ప్రతీ పౌ రుడు ఓటుహక్కు వినియోగించుకోవాలని మతం, కులం ఆధారంగా చేసుకుని ఓటు వేయొద్దని స్కిట్‌లో ప్రదర్శించారు. నోటుకు ఓటు ద్వారా నాయకులను ప్రశ్నించే అధికారం కోల్పోతామని, ఇలా పలు అంశాలు ప్రస్తావిస్తూ ఈ స్కిట్‌ను ప్రదర్శించారు. ఈ స్కిట్‌కు కలెక్టర్ వరుణ్‌రెడ్డి రూ.10వేల బహుమతిని అందజేశారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అభినందించారు.
చదవండి: Telangana: సర్కార్‌బడుల్లో ‘అల్పాహారం’.. టిఫిన్లు ఇవే..