Skip to main content

School Education: విద్యార్థుల‌ను బ‌డిలో చేర్పించాలి..

విద్యాశాఖాధికారులతో నిర్వ‌హించిన స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. బ‌డి బ‌య‌ట ఉన్న విద్యార్థులంద‌రినీ బ‌డిలోకి చేర్పించాల‌న్నారు. ఇదే విష‌యంపై స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అధికారిని కూడా ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో వారు ఇలా మాట్లాడారు..

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లాలో బడి బయట ఉన్న 2,141 మంది విద్యార్థులు వచ్చే నెల పదో తేదీలోగా బడిలో లేదా ఓపెన్‌ స్కూల్లో చేర్పించాలని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన విద్యాశాఖాధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు సంబంధించిన జీఈఆర్‌ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (స్థూల నమోదు నిష్పత్తి) శతశాతంగా ఉండాలన్నారు.

➤   TSBIE: ఇంటర్‌ ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఇదే..

చదువుపై ఆసక్తి లేని వారిని వృత్తి విద్యా శిక్షణలో చేర్పించాలని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిని ఆదేశించారు. స్టూడెంట్‌ ఇన్ఫో పోర్టల్‌ నమోదు కాని 11,560 విద్యార్థుల వివరాలు వచ్చే నెల పదిలోగా ఆన్‌లైన్‌లో నమెదు చేయాలన్నారు. నవంబర్‌ 3న ఆంగ్ల మాధ్యమంలో జరిగే ఎస్‌ఈఏఎస్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవగాహన తరగతులు, వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్ట్స్‌ నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రేమెడియల్‌ తరగతులు నిర్వహించి శత శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలన్నారు.

➤   DCPO Notifications: డీసీపీఓ కు ద‌ర‌ఖాస్తులు

డీఈవో వెంకటలక్ష్మమ్మ, డీవైఈవో సుజాత, ఏడీ(స్కిమ్స్‌) రవిబాబు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చాముండేశ్వరరావు, జిల్లాలో ఎంఈవోలు, సీఆర్పీలు పాల్గొన్నారు.

Published date : 27 Oct 2023 01:33PM

Photo Stories