Skip to main content

Collection of admission fees in Government School: ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి డబ్బులు వసూలు

సాక్షి ఎడ్యుకేష‌న్ : హుకుంపేట మండలం సూకురు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశానికి రూ.700 వసూలు చేసి,వేరే పా ఠశాలలో చేరమని విద్యార్థిని పంపేసిన హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మంగళవారం ఆదేశించారు.
Collection of admission fees in Government School
Collection of admission fees in Government School

హుకుంపేట మండలంలోని జామిగుడ గ్రామానికి చెందిన సీదరి గణేష్‌ 8వతరగతిలో ప్రవేశానికి గాను తల్లితో కలిసి సూకూరు పాఠశాలకు మంగళవారం వెళ్లాడు. ప్రధానోపాధ్యాయుడు బైరాగి మజ్జిని సంప్రదించగా ప్రవేశం కల్పిస్తానని రూ.700 తీసుకుని బాకూరు ఆశ్రమ పాఠశాలలో చేరమని అక్కడ నుంచి పంపించినట్టు గణేష్‌ తల్లి రాత్రి 8గంటల సమయంలో కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ వెంటనే స్పందించి ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజనీతో మాట్లాడారు. హెచ్‌ఎంపై శాఖపరమైన చర్యలకు కలెక్టర్‌ ఆదేశించారు.

After Class 12th: టీచింగ్ అంటే ఇష్ట‌మా... అయితే ఇంట‌ర్ త‌ర్వాత మీరు ఈ కోర్సులు చేయ‌డం బెస్ట్‌

కలెక్టరేట్‌లో విచారణ 

పాఠశాలలో ప్రవేశానికి రూ.700 వసూలు చేసి కూడా సీటు ఇవ్వకుండా మరో పాఠశాలలో చేరమని పంపిన హెచ్‌ఎంపై సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం ఉదయం హెచ్‌ఎంతో పాటు,విద్యార్థి,తల్లిని కూడా కలెక్టరేట్‌లో హాజరుపరచాలని, డీడీ,ఏటీడబ్యువో లు కూడా హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.విద్యార్థి సీదరి గణేష్‌కు సూకూరు పాఠశాలలోనే ప్రవేశం కల్పించి, హెచ్‌ఎం వసూలు చేసిన రూ. 700ను తల్లికి తిరిగి ఇప్పిస్తానని కలెక్టర్‌ తెలిపారు.

సూకూరు హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాలు

Published date : 26 Jul 2023 01:19PM

Photo Stories