Skip to main content

CIPET Application Last Date : సీపెట్‌లో ప్రవేశాలకు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ప్లాస్టిక్, అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ కోర్సులకు ప్రవేశాల గడువును విజయవాడలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) పొడిగించింది.

పదో తరగతి, బీఎస్సీ పూర్తి చేసి.. ప్లాస్టిక్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సీపెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ సూచించారు. పదో తరగతి పూర్తయినవారు మూడేళ్ల కాలపరిమితి గల డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బీఎస్సీ పూర్తయినవారు రెండేళ్ల కాలపరిమితి గల పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ కోర్సుకు అర్హులన్నారు. కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ వసతి కలి్పస్తామన్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ప్లాస్టిక్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందిస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు 78935 86494 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Published date : 23 Aug 2022 04:14PM

Photo Stories