Deemed Universities: ఈ నిబంధనలు ఉంటేనే ఇకపై డీమ్డ్ యూనివర్సిటీ... వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి
జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 2019నాటి నిబంధనలను రద్దు చేసి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు.
డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకొనే సంస్థలకు వరుసగా మూడేళ్లపాటు 3.01 సీజీపీఏతో న్యాక్-ఏ గ్రేడ్ కానీ, ఆ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో రెండో వంతుకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ కానీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ రూపొందించిన ప్రత్యేక కేటగిరీ ర్యాంకుల్లో టాప్-50లోపు, ఓవరాల్ ర్యాంకుల్లో టాప్-100లోపు ఉండాలి.
చదవండి: పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నెలకు 2.80 లక్షల వేతనం... పూర్తి వివరాలు ఇవే
ఎక్కువ సంఖ్యలో విద్యా సంస్థలను నడుపుతున్న వారు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాలయాలను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీసం ఏ, అంతకుమించి గ్రేడ్‌లు పొందిన డీమ్డ్ యూనివర్సిటీలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో యూనివర్సిటీల కేటగిరీలో 1 నుంచి 100 ర్యాంకులు పొందిన సంస్థలు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన సంస్థలు ఆ హోదా పొందిన 5 ఏళ్ల తర్వాత ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: ఎలాంటి పరీక్ష లేదు... జస్ట్ పదో తరగతి మార్కులతోనే రైల్వేలో ఖాళీల భర్తీ
ఈ సంస్థల పని తీరును యూజీసీ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కొత్త కోర్సులు ప్రారంభానికి ఇచ్చిన అనుమతులు రద్దుచేస్తారు.
డీమ్డ్ యూనివర్సిటీలు ప్రారంభించే కోర్సులు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ పరిధిలోకి వచ్చేట్లయితే రుసుములు, సీట్ల విషయంలో ఆయా సంస్థలు నిర్దేశించే నియమాలనే పాటించాలి.
చదవండి: డిగ్రీ అర్హతతో... ప్రభుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీలు రుసుముల్లో రాయితీలు, ఉపకారవేతనాలతో పాటు సీట్లు కేటాయించొచ్చు.
డీమ్డ్ యూనివర్సిటీలు తప్పనిసరిగా విద్యార్థులకు అకడెమిక్ క్రెడిట్స్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ స్కోర్‌ను వారి డిజిటల్ లాకర్స్‌లో భద్రపరచాలి.
ప్రవేశాల ప్రారంభానికి కనీసం 60 రోజుల ముందు ఫీజు, వాటి రీఫండ్ విధానం, ఒక్కో కోర్సులో ఉన్న సీట్లు, ప్రవేశార్హతలు, ప్రవేశ ప్రక్రియ గురించి తమ వెబ్‌సైట్‌లో స్పష్టంగా చెప్పాలి.