NTPC Jobs: పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నెలకు 2.80 లక్షల వేతనం... పూర్తి వివరాలు ఇవే

అర్హులైన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
ఖాళీలు: 11
వయసు: 30 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : పోస్టును అనుసరించి నెలకు రూ.50 వేల నుంచి రూ.2.80 లక్షలు
చదవండి: ఎలాంటి పరీక్ష లేదు... జస్ట్ పదో తరగతి మార్కులతోనే రైల్వేలో ఖాళీల భర్తీ
ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.

పోస్టుల వివరాలు ఇవే...
అడిషనల్ జనరల్ మేనేజర్ : గుర్తింపు పొందిన కళాశాల లేదా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి, కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. 52 సంవత్సరాల వయసు లోపు వారు అర్హులు. జీతం నెలకు రూ.1.20 లక్షలు - 2.80 లక్షలు ఉంటుంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్ : కెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. గరిష్ట వయసు 47 ఏళ్లు. జీతం నెలకు రూ.1 లక్ష - రూ.2.60 లక్షలు.
చదవండి: డిగ్రీ అర్హతతో... ప్రభుత్వ బ్యాంకుల్లో 9 వేల ఖాళీలు... ఇలా అప్లై చేసుకోండి
సీనియర్ మేనేజర్: గుర్తింపు పొందిన కళాశాల లేదా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. గరిష్ట వయసు 44 ఏళ్లు. జీతం నెలకు రూ.90 వేల నుంచి రూ. 2.40 లక్షలు ఉంటుంది.

అసిస్టెంట్ మేనేజర్ : ఇంజినీరింగ్‌లో కెమికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎన్విరాన్మెంట్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇండస్ట్రీయల్ ఫైర్‌సేఫ్టీలో డిప్లమా చేసి ఉండాలి. 35 సంవత్సరాల వయసు లోపు వాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. జీతం నెలకు రూ.60 వేల నుంచి రూ.1.80 లక్షలు ఉంటుంది.
చదవండి: మహిళలకు గుడ్ న్యూస్... టాటాలో భారీగా ఉద్యోగాలు... పూర్తి వివరాలు ఇవే...
ఇంజినీర్ : కెమికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. 30 ఏళ్ల వయసు లోపు యువకులే ఈ పోస్ట్‌కు అర్హులు. జీతం నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షలు ఉంటుంది.
వివరాలకు https://www.ntpc.co.in సందర్శించవచ్చు.