Career Exploration Internship: 'ఇంటర్న్‌షిప్'.. విద్యార్థుల కెరీర్ అన్వేషణ, అభివృద్ధికి, కొత్త నైపుణ్యాలు ఇవే..
డిసెంబర్ 27(బుధవారం)న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి ఇంటర్న్‌షిప్ వృత్తి శిక్షణ నిర్వహణ తీరుపై విశదీకరించారు. వృత్తిపరమైన అభ్యాస అనుభవం, విద్యార్థి అధ్యయన రంగానికి లేదా కెరీర్ ఆసక్తికి సంబంధించిన అర్ధవంతమైన, ఆచరణాత్మక పనిని ఇంటర్న్‌షిప్ అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 53 డిగ్రీ కళాశాలలో 4,382 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం నమోదయ్యారని, 66 ప్రభుత్వ, 15 ప్రైవేట్ సంస్థలలో ఇంటర్న్‌షిప్ పొందాల్సి ఉందన్నారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు ఈ ఆరు నెలల ఇంటర్న్ షిప్‌కు ఆసక్తి ఉన్న పిల్లల జాబితాలను జనవరి రెండో తేదీ నాటికి వికాస సంస్థకు అందించాలన్నారు.
Investments In Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు.. వాస్తవాలు ఇవే..
రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ..
జనవరి రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. బయట ప్రాంతాలలో ఇంటర్న్ షిప్ చేయదలచిన విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఆయా సంస్థలతో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. 90 శాతం హాజరు ఉన్నవారికి ఇంటర్న్‌షిప్ ధ్రువపత్రాలు అందించనున్నట్టు తెలిపారు. నన్నయ వర్సిటీ ప్రొఫెసర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నేర్చుకున్న కోర్సులను బట్టి ఆసక్తి ఉన్న రంగంలో ఇంటర్న్‌షిప్ పొందాలని సూచించారు. ప్రతి కళాశాలలో 20, 30 మంది విద్యార్థులకు ఒక మెంటర్‌ను నియమించనున్నట్టు తెలిపారు. వికాస పథక సంచాలకులు కె. లచ్చారావు మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్ విధి విధానాలను ప్రిన్సిపాళ్లకు వివరించారు. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు, వికాస మేనేజర్ జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.