Bhavitha Center: విద్యార్థులకు భవిత కేంద్రంతో మేలు
Sakshi Education
అద్దంకి: విద్యార్థులకు భవిత కేంద్రంతో ఉపయోగంగా ఉంటుందని సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా ఐఈ కో ఆర్డినేటర్ మట్లా జ్యోత్స్న అన్నారు.
ఆమె మంగళవారం స్థానిక భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె కేంద్రంలోని రిజిస్టర్, పిల్లల నోట్ బుక్స్ పరిశీలించారు. పిల్లలపై ఉపాధ్యాయులు చూపిస్తున్న శ్రద్ధపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ భవిత కేంద్ర నిర్వహణ బాగుందన్నారు. దాతల చేయూతతోపాటు, ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. అద్దంకి కేంద్రాన్ని మిగిలిన కేంద్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పిల్లల మానసికంగా పరిపక్వత కోసం ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ బాగుందని ప్రశసించారు. ఇదే విధంగా మిగిలిన కేంద్రాల్లోనూ దాతలు ముందుకు వచ్చి వారికి అవసరమైన ఉపకరణాలు అందించి వారి భవితకు బంగారు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగాధరరావు, ఐఈఆర్‌టీ ఉపాధ్యాయులు కొంగల శ్రీనివాస్, పాలపర్తి యోనా పాల్గొన్నారు.
Published date : 06 Mar 2024 05:27PM