Skip to main content

Facilities at Hostels : వ‌స‌తి గ్రుహాల్లో విద్యార్థుల‌కు మౌలిక స‌దుపాయాలు కల్పించాలి..

నగరంలో తాత్కాలింగా మూతకు గురైన బీసీ, డీఎన్‌టీ వసతి గృహాలను వెంటనే పునః ప్రారంభించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాల‌ని డిమాండ్ చేశారు విద్యార్థులు..
Basic facilities and needs should be provided for students in hostels

కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి వసతి కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డీ సోమన్న కోరారు. నగరంలో తాత్కాలింగా మూతకు గురైన బీసీ, డీఎన్‌టీ వసతి గృహాలను వెంటనే పునః ప్రారంభించాలని, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్‌పై శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక సంక్షేమభవన్‌లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ.. గురుకులాలు, కేజీబీవీ, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల్లో 100 మందికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనను ఎత్తివేయాలన్నారు. ప్రతి హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు.

6th Graduation Day : నేడు ట్రిపుల్‌ ఐఐటీడీఎంలో 6వ స్నాత‌కోత్స‌వం.. బీటెక్ విద్యార్థుల‌కు ప‌ట్టాలు!

న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి పీ వెంకటలక్షుమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే రంగలక్ష్మిదేవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటలక్షుమ్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరడంతో తాత్కాలికంగా మూసి వేశామని, ఆద్దె భవనం లభించిన వెంటనే ఆయా హాస్టళ్లను పునః ప్రారంభిస్తామన్నారు. జేడీ రంగలక్ష్మిదేవి మాట్లాడుతూ గతంలో ఉన్న బాలుర వసతి గృహం ఎందుకు మూతకు గురైందో తెలుసుకొని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

TG DSC 2024: డీఎస్సీకి 2.79 లక్షల దరఖాస్తులు.. వీరికి డీఎస్సీలో..

Published date : 24 Jun 2024 08:35AM

Photo Stories