Andhra Pradesh: జిల్లా స్థాయిలో పురస్కారాలు... ఎవరికి?
Sakshi Education
శుక్రవారం ఒక ప్రకటనలో అన్నమయ్యజిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించేందుకు ఈనెల 30 లోగా దరిఖాస్తులు పూర్తి చేసుకోవాలని పేర్కొంటూ, దరిఖాస్తు చేసుకునే విధానం తెలిపారు..
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా స్థాయి ఉపాధ్యాయ పురస్కారాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్యజిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ /జిల్లా పరిషత్/ ఎయిడెడ్ /పురపాలక యాజమాన్యం/ఏపీఆర్‌ఈజె/ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఎస్/ ఏపీ మోడల్/కెజీబీవి/ ఇతర యాజమాన్య ( ప్రైవేట్ విద్యాసంస్థలు తప్ప) ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.కనీసం 10 సంవత్సరాలు బోధన అనుభవం కలిగిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 30 వరకు గడువు ఉందని చెప్పారు
ఆ ఊరిలో ఇంటికో డాక్టర్ ఎందుకున్నారు? ఇందుకు ఎవరు ప్రేరణగా నిలిచారు?
Published date : 26 Aug 2023 03:32PM