Teachers Awards 2023: ఉపాధ్యాయులకు పురస్కారం
సాక్షి ఎడ్యుకేషన్: తన జీవితంలో వేలాది మందిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు అడుగులు వేయించే ప్రతి ఉపాధ్యాయుడికీ ప్రభుత్వం ఉత్తమ పురస్కారం అందించి సత్కరిస్తోంది. విద్యార్థులను సరైనమార్గంలో నడిపించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచిన మాస్టార్లను ఎంపిక చేశారు. సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాల ప్రదానం చేసి సన్మానించనున్నట్లు డీఈఓ పురుషోత్తం తెలిపారు.
రాయచోటిలోని చిత్తూరు మదనపల్లి రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న లయ గార్డెన్‌లో మ ధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేసిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని డీఈఓ పురుషోత్తం తెలియజేశారు.
Study Abroad: భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 30 వేల మందికి ఫ్రాన్స్ సాదర ఆహ్వానం..!
కటిక పేదరికం నుంచి..
కడప ఉర్దూ నగరపాలక బాలుర హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న జుబేర్ అహమ్మద్‌ది కడప నగరమే. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన కడపలోనే పది వరకు చదివారు. డీఎడ్ రాయచోటి, బిఈడీని రాజంపేటలో పూర్తి చేసి 2010లో ఉద్యోగం సాధించారు. మొట్టమొదటగా కడపలోని నక్కాస్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. తరువాత 2019లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చాడు. చదువుకున్న పాఠశాలలోనే నేడు మ్యాథ్ టీచర్‌గా పని చేస్తున్నారు.
కష్టపడితే ఫలితముంటుంది...
National Teachers Day 2023: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారాలు
ఎవరైనా కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుందని.. పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలని సూచిస్తున్నారు.