Online Certificate Courses: ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులపై ఆసక్తి ఉన్న రైతులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులైన చిరుధాన్యాలు, పట్టుపురుగుల పెంపకం, వర్మి కంపోస్ట్, బయో ఫెర్టిలైజర్స్ కోర్సులకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించినట్లు చెప్పారు. కోర్సుల తరగతులు 8 వారాల పాటు(2 నెలలు) ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, ట్యాబ్‌కానీ, కంప్యూటర్ కానీ కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒక్కొక్క కోర్సుకు ఫీజు రూ.1500 చొప్పున చెల్లించి అక్టోబర్ చివరిలోగా పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను గానీ, 8008788776, 8309626619, 9110562727 నంబర్లలో పనివేళల్లో మాత్రమే సంప్రదించాలని కోరారు.
చదవండి: AP PGCET-2023: నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్