‘మా పిల్లలను ఆంధ్రాలో చదివించుకుంటాం’..ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి,పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటామని రాయఘడ సమితి, గంగాబడ పంచాయతీలోని మాణిక్యపట్నం గ్రామస్తులు తెలిపారు.
ఇదే విషయమై నవంబర్ 2వ తేదీన కలెక్టరేట్‌ని చేరుకుని, ఏడీఎం సంగ్రాం శేఖర పండాకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పంచాయతీలో పాఠశాలలు సరిగా తెరవడం లేదని, ఒకవేళ తెరిచినా ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకావడం లేదన్నారు.
దీంతో ఏఓబీలోని శ్రీకాకుళం జిల్లా(ఏపీ), మందస మండలంలోని పాఠశాలలో పిల్లలను చేరి్పంచాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలలు తెరిపించి, సరిపడ ఉపాధ్యాయులు లేనిచోట ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. లేకపోతే తమకు దగ్గరలోని ఆంధ్రా పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని స్పష్టం చేశారు.
Published date : 03 Nov 2021 06:16PM