Admission in Gurukula College: గురుకుల కళాశాలలో ప్రవేశాలు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పాత గుంటూరు నందివెలుగు రోడ్డులో నిర్వహిస్తున్న ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ముస్లిం, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న ఏకై క కళాశాల ఇదేనని పేర్కొన్నారు. ఏపీఆర్‌జేసీ సెట్‌తో సంబంధం లేకుండా టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థు లు నేరుగా ప్రవేశాన్ని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఇంగ్లీషు మీడియంలో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ముస్లిం, మైనార్టీ విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు కళాశాలలో నేరుగాను, 98495 59611, 87126 25073 సెల్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Published date : 05 Mar 2024 04:54PM