Skip to main content

వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు

రాబందుల పరిరక్షణ కార్యక్రమం భారతదేశంలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్న రాబందుల సంఖ్య ప్రస్తుతం 99% తగ్గిపోయింది. చనిపోయిన జంతువుల కళేబరాలను రాబందులు ఆహారంగా తీసుకొని పరిసరాలను శుభ్రం చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. రాబందు శాస్త్రీయ నామం జిప్స్ బెంగలెన్సిస్ (Gyps bengalensis). భారతదేశంలో 9 జాతుల రాబందులున్నాయి.
White backed vulture, Slender billed vulture, Long billed vulture అనే మూడు జాతులు భారత్‌లో ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల వీటిని Critically Endangered జాబితాలో చేర్చారు. వీటి సంఖ్య తగ్గడానికి కారణం డైక్లోఫినాక్ అనే మందు. ఈ మందును పశువులకు వాడటం, అవి చనిపోయిన తర్వాత వాటిని రాబందులు ఆహారంగా తీసుకోవడం వల్ల డైక్లోఫినాక్ వాటి శరీరంలోకి చేరి మూత్రపిండాలను దెబ్బతీస్తోంది. భారత ప్రభుత్వం పశువులకు వాడే డైక్లోఫినాక్‌ను 2006లో నిషేధించింది. దానికి బదులుగా Meloxicam అనే మందును ప్రస్తుతం వాడుతున్నారు. Vulture Conservation and Breeding Centerను హరియాణాలోని పింజోర్ (Pinjore)లో 2001లో ఏర్పాటు చేశారు. అలాగే డైక్లోఫినాక్ మందుతో కలుషితం కాని ఆహారాన్ని అందించి వాటిని సంరక్షించే లక్ష్యంతో Vulture Restaurant (రాబందుల రెస్టారెంట్)లను మహారాష్ర్టలోని గడ్చిరోలి, రాయగఢ్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. పంజాబ్‌లోని కత్లోర్, చందోలా ప్రాంతాల్లో కూడా రాబందు రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాబందుల సంరక్షణకు SAVE (Saving Asiatic Vulture from Extinction) అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.

ప్రాజెక్ట్ స్నో లెపార్డ్ (2009)
Snow Leopard శాస్త్రీయ నామం Uncia uncia. భారత్‌లోని జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇవి కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 7,400. అత్యధిక మంచు చిరుతలు చైనాలో ఉండగా భారత్‌లో వీటి సంఖ్య కేవలం 400 - 700 మధ్య ఉందని అంచనా. జీవావరణ పరంగా ఇవి Endangered (ప్రమాదకర) స్థితిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచు చిరుతల్లో భారత్ 10 శాతాన్ని కలిగి ఉంది. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో హిమాలయ, ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉన్న పైన్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. ఉన్నత పర్వత శ్రేణుల ప్రాంతాల్లో నివసించే జీవులను, వాటి ఆవాసాలను పరిరక్షించడం Project Snow Leopard ముఖ్య ఉద్దేశం. ఆవాస క్షీణత, పర్యావరణ మార్పులు, తీవ్ర ఆహార కొరత, వ్యాధులు మొదలైన కారణాల వల్ల వీటి సంఖ్య తగ్గిపోయింది.

ప్రాజెక్ట్ హంగుల్/సేవ్ కశ్మీర్ రెడ్ డీర్ హంగుల్ ప్రాజెక్ట్
హంగుల్ (Hangul) సంరక్షణ కోసం WWF (World Wildlife Fund), IUCN (International Union for Conservation of Nature) సహకారంతో జమ్మూకశ్మీర్ రాష్ర్టం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీన్ని సాధారణంగా కశ్మీర్ స్టాగ్ అని పిలుస్తారు. ఇది రెడ్‌డీర్ జాతికి చెందింది. శాస్త్రీయ నామం Cervus elaphus hanglu. ఇది జమ్మూకశ్మీర్ రాష్ర్ట జంతువు. కేవలం జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రమే కనిపిస్తోంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని డచ్‌గామ్ నేషనల్ పార్‌‌కలో ఎక్కువగా ఉంటుంది. 1940 నాటికి వీటి జనాభా 5,000 ఉండగా 1970 నాటికి 170కి తగ్గిపోయింది. Project Hangul (1980) తర్వాత వీటి జనాభా 340కి పెరిగింది. మళ్లీ 2008 నాటికి 160కి తగ్గిపోయింది. IUCN Red data list ప్రకారం ఇవి ప్రమాదకర జాబితాలో ఉన్నాయి.

2009లో ఈ ప్రాజెక్టు పేరును ‘సేవ్ కశ్మీర్ రెడ్ డీర్ హంగుల్’గా మార్చారు. వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం, అడవులు తగ్గిపోవడం, వేట, ఆవాస క్షీణత, గడ్డి దొరక్కపోవడం, గడ్డిని తినే ఇతర జీవులు పెరగడం వల్ల వీటికి ఆహార కొరత ఏర్పడింది. అంతేకాకుండా తీవ్రవాదులు మాంసం కోసం చంపడం మొదలైన కారణాల వల్ల వీటి సంఖ్య తగ్గిపోయింది.

సీ టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్
సముద్రంలో నివసించే తాబేలును ‘టర్టిల్’ (Turtle) అని, మంచినీటి తాబేలును టెర్రాపిన్ (Terrapin) అని, భూమిపై నివసించే తాబేలును ‘టార్టాయిస్’ (Tortoise) అని అంటారు. ఆలీవ్ రిడ్లే (Olive Ridley) అనే సముద్ర తాబేలు సంరక్షణకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రతి ఏటా శీత కాలంలో వేల కొద్దీ ఆలీవ్ రిడ్లే తాబేళ్లు భారతదేశ తూర్పు తీర ప్రాంతానికి చేరి సంతానోత్పత్తి చేస్తాయి. 10 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. ప్రధానంగా ఒడిశాలోని Gahirmatha బీచ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరి గుడ్లు పెడతాయి. ప్రపంచంలోనే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. అందువల్ల దీన్ని ప్రభుత్వం Gahirmatha marine wild life sanctuaryగా గుర్తించింది. ఒడిశాలో 16,000 మర పడవలు, ట్రాలర్‌‌స ఉన్నాయి. వీటికి ఢీకొని, వలలో చిక్కి లక్షకు పైగా ఆలీవ్ రిడ్లే తాబేళ్లు మరణించాయి. వీటి గుడ్లను మనుషులు, జంతువులు తినడం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. ఒడిశా ప్రభుత్వం 1998లో WPSI (Wildlife Prote-ction Society of India) సహకారంతో తాబేళ్ల సంరక్షణకు Operation kachhapaను ప్రారంభించింది. కచ్చప అంటే ఒడియాలో తాబేలు అని అర్థం.

భారత మొసలి సంరక్షణ ప్రాజెక్ట్
భారతదేశంలోని మొసళ్లను సంరక్షించే ప్రాజెక్టును 1975లో ప్రారంభించారు. మొసళ్ల చర్మం, వాటి శరీరంపై ఉన్న పొలుసుల నుంచి లభించే నూనె కోసం అక్రమ రవాణా చేయడంతో వాటి సంఖ్య తగ్గిపోతోంది. భారతదేశంలో 3 రకాల మొసళ్లు ఉన్నాయి.
1. ఘరియల్
2. మగ్గర్
3. ఉప్పునీటి మొసలి
మొసళ్ల గుడ్లను సేకరించి, వాటిని కృత్రిమంగా పొదిగించి, పిల్లలు కొంత ఎదిగిన తర్వాత వాటిని సహజ ఆవాసాల్లో వదిలివేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటి వరకు 7000 మొసళ్లను పెంచి సహజ ఆవాసాల్లో వదిలారు. ఈ ప్రాజెక్టు కోసం Central Crocodile Breeding and Management Training Instituteను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

Indian Rhino Vision 2020
భారతదేశంలో ఉన్న One horned rhinoceros (ఒంటి కొమ్ము ఖడ్గమృగాల) సంఖ్యను 2020 నాటికి 3000కు పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంతేకాకుండా అధికంగా ఉన్న ఖడ్గమృగాలను ఇతర ప్రాంతాలకు తరలించడం ఈ ప్రాజెక్టులో ఒక భాగం.
ఒంటి కొమ్ము ఖడ్గమృగం శాస్త్రీయ నామం Rhinoceros unicornis. ప్రపంచవ్యాప్తంగా 3,300 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అయితే వాటిలో 75% మన దేశంలోని అసోంలో ఉన్నాయి. వీటి కొమ్ము కెరాటిన్‌తో తయారవుతుంది. చైనా వైద్యంలో దీనికి ప్రాధాన్యం ఉండటంతో పెద్ద మొత్తంలో వీటిని వేటాడుతున్నారు. వీటి సంరక్షణకు అసోం ప్రభుత్వం, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, WWF, International Rhino Foundation (IRF)ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అసోంలోని కజిరంగా నేషనల్ పార్‌‌కలో ఉన్నాయి. అసోంలో ఉన్న మొత్తం ఖడ్గ మృగాల్లో 85 శాతం ఈ జాతీయ పార్కులోనే ఉన్నాయి. అసోంలోని మనాస్ వైల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ, పోబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీలో కూడా అధిక సంఖ్యలో ఖడ్గమృగాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కజిరంగా, పోబిటోరా జాతీయ పార్కుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఖడ్గమృగాలను మనాస్ నేషనల్ పార్కుకి తరలించారు.

Project Elephant 1992
భారతదేశంలో నివసించే ఆసియా జాతి ఏనుగు (ఎలిఫస్ మాక్సిమస్)లను, వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం 1992లో ప్రారంభించింది. ఆసియా ఖండంలో విస్తరించి ఉన్న ఆసియా జాతి ఏనుగుల్లో 60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. 2012లో భారత ప్రభుత్వం లెక్కల ప్రకారం 29,391 - 30,711 ఏనుగులు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్ట, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. దంతాల కోసం ఏనుగులను చంపుతున్నారు. అడవుల నరికివేత, అభివృద్ధి పేరుతో రిజర్వాయర్లు నిర్మించడం, అడవుల్లో రోడ్లు, రైల్వే లైన్లు వేయడం మొదలైన కారణాల వల్ల ఏనుగుల సంఖ్య తగ్గిపోతోంది. ఇటీవల అటవీ ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని అనేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి.
వీటి సంరక్షణ కోసం 28 Elephant Reserveలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవేకాకుండా ఇటీవల మరో రెండు ఎలిఫెంట్ రిజర్‌‌వలను ఏర్పాటు చేశారు. అవి.. మేఘాలయలోని ఖాసీ ఎలిఫెంట్ రిజర్‌‌వ, కర్ణాటకలోని దండేలి ఎలిఫెంట్ రిజర్వ్. అంతర్జాతీయ CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం ప్రకారం దక్షిణ ఆసియాలోని ఏనుగుల పరిరక్షణ కోసం 2003లో Monitoring the Illegal Killing of Elephants (MIKE) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భారత ప్రభుత్వం ఏనుగును National Heritage Animalగా ప్రకటించింది. అంతేకాకుండా Elephant Task Forceను కూడా ఏర్పాటు చేసింది. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారత పర్యావరణశాఖ, వైల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో Haathi Mere Saathi (హాథీ మేరే సాథీ అంటే Elephant is my friend) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏనుగులు 50 దేశాల్లో ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి E50:50 ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మొట్టమొదటి International Elephant Congress and ministerial meet 20-1-3లో న్యూఢిల్లీలో జరిగింది.

Project Tiger 1973
భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్‌ను 1973లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1900 సంవత్సరం నాటికి 40,000 ఉన్న పులుల సంఖ్య 1972 నాటికి 1800కు తగ్గిపోయింది. చర్మం, గోళ్లు, వైద్య రంగంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పులులను చంపడంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. వీటి సంరక్షణ కోసం National Tiger Conservation Authorityని ఏర్పాటు చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. అలాగే 18 రాష్ట్రాల్లో 49 టైగర్ రిజర్‌‌వలను ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల 2010లో 1706గా ఉన్న పులుల సంఖ్య 30% పెరిగి 2,226కి చేరుకుంది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి.

గంగానది డాల్ఫిన్ పరిరక్షణ కార్యక్రమం
భారతదేశంలో నివసించే ఏకైక మంచినీటి డాల్ఫిన్... గాంగెస్ రివర్ డాల్ఫిన్. దీని శాస్త్రీయ నామం ప్లాటినిష్టా గాంగెటికా. ఇది గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో మాత్రమే ఉంటుంది. IUCN Red data ప్రకారం ఇవి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటి సంఖ్య ప్రస్తుతం 2,000 కంటే తక్కువ. గంగా పరివాహక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, అసోంలలో ఇవి కనిపిస్తాయి. WWF India ఆధ్వర్యంలో Ganges River Dolphin conservation Programmeను 1997లో ప్రారంభించారు. వీటిని సాధారణంగా సుసు (Susu) అని పిలుస్తారు. భారత ప్రభుత్వం దీన్ని National Aquatic Animalగా ప్రకటించింది. గంగా నదిలో తీవ్ర కాలుష్యం, డ్యామ్‌ల నిర్మాణం, మత్స్యకారుల వలలో చిక్కడం, వేటాడటం వంటి కారణాల వల్ల ఇవి అంతరిస్తున్నాయి.

మాదిరి ప్రశ్నలు

1. Central Crocodile Breeding and Management Training Institute ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) చెన్నై
సి) ముంబై
డి) కోల్‌కతా

Published date : 30 Jul 2016 11:16AM

Photo Stories